Type Here to Get Search Results !

Sports Ad

రోహితన్న మహిళా చేయూత కార్యక్రమం MLA ROHITH REDDY


రోహితన్న మహిళా చేయూత కార్యక్రమం 

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియెజకవర్గం రోహిత్ అన్న మహిళా చేయూత కార్యక్రమం కోటపల్లి మండల కేంద్రంలో తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారి అమ్మ వికారాబాద్ జడ్పిటిసి ప్రమోదిని గారిచే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచనతో రోహిత్ రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, డ్రైవింగ్ , పచ్చడిలా తయారీ, ఇలా ఇంటి దగ్గర ఉండి స్వయంకృషితో పని చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు.కావున ఈ శిక్షణ తరగతులను గ్రామీణ ప్రాంతంలోని మహిళలు ఉపయోగించుకొని వారి జీవన ఉపాధిని మెరుగుపరచుకోవాలి అని అన్నారు, ఇవి ఉపయోగించుకోవడానికి మహిళలు ముందుకు రావాలి అని అన్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్య పరచడం జరుగుతుందని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శకుంతల, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సీనియర్ నాయకులు పతంగి పాండు, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనిల్ కుమార్ , ఉప్పరి నారాయణ, సమ్మయ్య, ఓగులాపురం రాజు,సుశీల్ కుమార్, మంగలి నాగేష్, దినేష్, నర్సింలు, శివకుమార్, చిదంబర, సురేష్, ఏ. నర్సింలు, ఏపిఎం శివయ్య, సిసి సంజీవ్ కుమార్, భాస్కర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies