Type Here to Get Search Results !

Sports Ad

ఇది భారత మహిళా అపురూప విజయం This is an incredible achievement for Indian women


 ఇది భారత మహిళా అపురూప విజయం

ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : చట్టసభలలో మహిళలకు 33శాతం కోటా కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం దక్కడంతో ఇక చట్టసభలలో ‘ ఆమె’ కొత్త కథకు, నయాసిల్‌సిలాకు జరిగింది. దాదాపు పది గంటలకు పైగా సుదీర్ఘ చర్చ తరువాత గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఓటింగ్ జరిగింది.ప్రతి సభ్యుడి వద్ద ఉన్న మల్టీ మీడియా డివైజ్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. పద్ధతిలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్‌లో మొత్తానికి మొత్తం 215 ఓట్లు అనుకూలంగా పడ్డాయి.

ఓటు ఒక్కటి పడలేదు . దీనితో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం దక్కింది. రాజ్యసభ అధ్యక్షుడు , ఉప జగదీప్ ధన్‌కర్ ఆధ్వర్యంలో ని ర్వహించారు.పార్లమెంట్ ఆమోదం పొందుతోన్న ఈ బిల్లు దేశ మహిళ శక్తి ని మరింత ద్విగుణీకృతం చేస్తుందని ప్రధాని మోడీ తమ ప్రసంగంలో తెలిపారు.ఈ బిల్లుపై జరిగిన చర్చ లో ఉభయసభలకు చెందిన 132 మంది సభ్యులు పాల్గొన్నారని , ఇది కొత్త పార్లమెంట్‌కు గర్వకారణం అని మోడీ తెలిపారు. ఈ చర్చల దశలో వ్యక్తమైన ప్రతి అంశానికి రాబోయే చరిత్రలో విలువ ఉంటుందన్నారు.బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ బిల్లు ఆమోదం పొం దడం పట్ల వెంటనే స్పందించారు. ఇది అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. బిల్లును ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం దక్కడంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపిస్తారు.అంతకుముందు మహిళా బిల్లును కేంద్రప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఒక్కరోజు క్రితం బుధవారం ఈ బిల్లు చారిత్రక రీతిలో లోక్‌సభలో ఆమోదం పొందింది.చట్టసభలలో మూడింట ఒక వంతు మహిళా కోటా సంబంధిత బిల్లు దేశంలోని మహిళల సాధికారత దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంపరలో భాగం అని బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ న్యాయశాఖ మంత్రి తెలిపారు.128వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందు కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
 * ఇది భారత మహిళా అపురూప విజయం ఇక్కడ క్లిక్ చేయండి
 * రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ క్లిక్ చేయండి
 * మీ ఆధార్‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
 * పచ్చి కొబ్బరి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ క్లిక్ చేయండి
 * ఎల్‌ఐసీలో ఈ పాలసీ తీసుకుంటే..నెల నెల రూ. 12 వేలు వస్తాయి తెలుసా..? ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies