బీఆర్ఎస్ మేనిఫెస్టోను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేశారు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పింఛన్ నెలకు ఇప్పుడు రూ. 3000 చేస్తాము తరువాత సవత్సరానికి రూ. 500 చొప్పున పెంచుకుంటూ రూ. 5000 చేస్తాము.రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల కేసీఆర్ బీమా రేషన్ కార్డు ఉన్నవారికి "తెలంగాణ అన్నపూర్ణ" పేరుతో సన్నబియ్యం రైతుబంధు, దళితబంధు కొనసాగింపు రైతు బంధు పథకం ఇప్పుడు రూ. 12000 కు పెంచుతాము తరువాత సంవత్సరానికి కొంచెం పెంచుతూ రూ.16000 చేస్తాము.రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కొక్కరికి "కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా" పేరుతో కొత్త పథకం తీసుకురానున్నారు..గ్యాస్ సిలిండర్ రూ. 400 కి సబ్సిడీలో అందించనున్నాము. జర్నలిస్ట్ లకు కూడా గ్యాస్ సిలిండర్ రూ. 400 కి సబ్సిడీలో అందించనున్నాము.దివ్యాంగులకు పింఛను ప్రతి సంవత్సరం రూ. 300 పెంచుతూ రూ. 6000 కు పెంచుతాము.