Type Here to Get Search Results !

Sports Ad

రేపు సూర్య గ్రహణం వెరీ వెరీ స్పెషల్.. ఇలాంటి గ్రహణం మళ్ళీ చూడాలంటే 23 ఏళ్లు ఆగాల్సిందే Tomorrow's solar eclipse will be very very special.. We will have to wait for 23 years to see an eclipse like this again.


 రేపు సూర్య గ్రహణం వెరీ వెరీ స్పెషల్.. ఇలాంటి గ్రహణం మళ్ళీ చూడాలంటే 23 ఏళ్లు ఆగాల్సిందే

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హిందూ ధర్మంలో గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉందని చాలా మంది నమ్ముతారు.సైన్స్ ప్రకారం  భూమి, సూర్యుని మార్గం మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అక్టోబర్ నెలలో రెండు వారాల వ్యవధిలో సూర్య , చంద్ర గ్రహణాలు రెండూ సంభవించనున్నాయి. సూర్య గ్రహణం రేపు ఏర్పడనుంది. ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య నాడు వస్తుంది. అంతేకాదు సూర్య గ్రహణం శని అమావాస్య రోజున ఏర్పడనుంది. దీంతో ఈ రోజుకి మతపరమైన ప్రాముఖ్యత ఉంది.  అయితే ఈ సూర్య గ్రహణం భారత దేశంలో కనిపించదు కనుక.. సుతకాలం చెల్లదు రింగ్ ఆఫ్ ఫైర్ గ్రహణం ఈ గ్రహణాన్ని “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు, ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు భూమి సూర్యుని మధ్య కు వెళ్లే సమయంలో సూర్య దూరం సగటు కంటే ఎక్కువగా ఉండటం వల్ల సూర్యుడు అతి చిన్నగా కనిపిస్తాడు. ఫలితంగా, సూర్యుని బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. మధ్య భాగం పూర్తిగా చంద్రునిచే కప్పబడి “ రింగ్ ఆఫ్ ఫైర్” ప్రభావాన్ని సృష్టిస్తుంది.

          సూర్యగ్రహణం సమయం :ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 శనివారం రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై.. తెల్లవారు జామున 02:25 గంటల కంటే ముందే ముగియనుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం వలన  మేష రాశి, కర్కాటక, తుల , మకరం రాశివారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సూర్య గ్రహణ ప్రభావం భారత దేశంలో లేకపోయినా గ్రహణ సమయంలో పూజ గదిలో దేవతలను తాకడం.. ఆలయాలు తెరవడం వంటి పనులు చేయవద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఏఏ దేశాల్లో కనిపించనున్నది అంటే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు.. అయితే ఉత్తర అమెరికా , కెనడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, గ్వాటెమాల, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, క్యూబా, బార్బడోస్, పెరూ, ఉరుగ్వే, ఆంటిగ్వా, వెనిజులా, జమైకా, హైతీ, పరాగ్వే, బ్రెజిల్, డొమినికా, బహామాస్ వంటి దేశాల్లో కనిపించనుంది.నేరుగా చూడడం అయితే సూర్య గ్రహాన్ని నేరుగా చూడటం సురక్షితం కాదు. ఎందుకంటే ఫిల్టర్ చేయని UV కిరణాలు నేరుగా  కళ్లకు తాకి రెటీనా పొరకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. గ్రహణాన్ని వీక్షించడానికి కెమెరాలు, టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేదా ఇతర ఆప్టికల్ పరికరాలను ఉపయోగించడం కూడా మీ కళ్ళకు హాని కలిగించవచ్చు.

మరిన్ని వార్తల కోసం... 
* రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 15వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇక్కడ క్లిక్ చేయండి
* 'డెంగీ' ప్రమాద ఘంటికలు ఇక్కడ క్లిక్ చేయండి
* నిరుద్యోగులకు నిరాశే...! ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు సూర్య గ్రహణం వెరీ వెరీ స్పెషల్.. ఇలాంటి గ్రహణం మళ్ళీ చూడాలంటే 23 ఏళ్లు ఆగాల్సిందే ఇక్కడ క్లిక్ చేయండి
* ఎడ్యుకేషన్​ లోన్​ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ! ఇక్కడ క్లిక్ చేయండ
* స్పీడ్​ పెంచిన పార్టీలు...ప్రచారం వ్యూహాల్లో లీడర్లు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies