Type Here to Get Search Results !

Sports Ad

'డెంగీ' ప్రమాద ఘంటికలు 'Dengue' alarm bells


 'డెంగీ' ప్రమాద ఘంటికలు 

* రాష్ట్రంలో భారీగా కేసుల నమోదు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

* ప్రాథమిక లక్షణాలతో మొదలై.. ప్రాణాంతకమవుతున్న తీరుతో ఆందోళన

* రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది.

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : సెప్టెంబరులో కేసులు తారస్థాయికి చేరుకోగా, ఈ నెలలోనూ ఉద్ధృతి కొనసాగుతోంది. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండానే తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతున్న ఉదంతాలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే డెంగీ కేసులు అధికారికంగానే ఆరువేలు దాటాయి. అందులో దాదాపు సగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. తర్వాత మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో భారీగా నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 600కుపైగా నిర్ధారణయ్యాయి. కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ, మణుగూరు, కొత్తగూడెం పట్టణం, మహబూబాబాద్‌ జిల్లా ముల్కనూరు పీహెచ్‌సీ పరిధి, ఆదిలాబాద్‌ జిల్లా అంకోలి పీహెచ్‌సీ పరిధిలో రెండు నెలలుగా తీవ్రత ఎక్కువగా ఉంది. జగిత్యాల గ్రామీణ జిల్లా పరిధిలో సెప్టెంబరు నెలలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే 70, పెద్దపల్లి జిల్లాలో 150కిపైగా నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ఈ నెలలోనూ అదే స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య అంతకు మూడింతలు ఉంటుందనే అంచనా ఉంది.

మూడు రోజుల్లోనే ముప్పు

గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణలో జరుగుతున్న జాప్యం బాధితుల ప్రాణాల మీదికి తెస్తోందనే ఆరోపణలున్నాయి. తీవ్ర లక్షణాలు లేకుండానే కొందరిలో ప్రాణాంతకంగా మారుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 'ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన 24 ఏళ్ల యువకుడు లండన్‌లో ఎంబీఏ పూర్తిచేసి, సోదరుడి నిశ్చితార్థ వేడుకల కోసం ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం రాత్రి అతనిలో స్వల్ప జ్వర లక్షణాలు బయటపడ్డాయి. సోమవారం మధ్యాహ్నానికి జ్వరం తీవ్రమైంది. మంగళవారం ఉదయానికే పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మా బిడ్డ మృతి చెందాడ'ని కుటుంబ సభ్యులు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మంథని చుట్టుపక్కలే మూడు నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు యువకులు ఇదే తరహాలో మరణించినట్టు బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత, రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత నిర్ధారణ సమాచారం రావడంలో జాప్యం జరగడం బాధితుల్లో లక్షణాలు తీవ్రమయ్యేందుకు, మరణాలకు కారణమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ ద్వారా సాధ్యమైనంత త్వరగా వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేలా చూస్తున్నామని, ఇటీవల సాంకేతిక పరమైన సమస్యలతో రెండు రోజులపాటు నివేదికలు ఇవ్వడంలో జాప్యం జరిగిందని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జ్వర లక్షణాలు బయటపడిన వెంటనే అప్రమత్తం కావాలని, వేగంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.కొందరు సాధారణ జ్వరంగానే భావించి మందుల దుకాణాల్లో ఔషధాలు తెచ్చుకుని వినియోగిస్తున్నారు. మరికొందరు ఆర్‌ఎంపీలను ఆశ్రయించి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయిన తర్వాత ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతోంది.ప్రభుత్వ వైద్యులు

మరిన్ని వార్తల కోసం... 
* రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 15వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇక్కడ క్లిక్ చేయండి
* 'డెంగీ' ప్రమాద ఘంటికలు ఇక్కడ క్లిక్ చేయండి
* నిరుద్యోగులకు నిరాశే...! ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు సూర్య గ్రహణం వెరీ వెరీ స్పెషల్.. ఇలాంటి గ్రహణం మళ్ళీ చూడాలంటే 23 ఏళ్లు ఆగాల్సిందే ఇక్కడ క్లిక్ చేయండి
* ఎడ్యుకేషన్​ లోన్​ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ! ఇక్కడ క్లిక్ చేయండ
* స్పీడ్​ పెంచిన పార్టీలు...ప్రచారం వ్యూహాల్లో లీడర్లు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies