Type Here to Get Search Results !

Sports Ad

రైతులకు శుభవార్త.. అప్పు కోసం వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లక్కర్లేదు.. కేంద్రం వెబ్‌సైట్‌లో తక్కువ వడ్డీకే లోన్! Good news for farmers.. No need to go to moneylender for loan.. Low interest loan on center's website!


రైతులకు శుభవార్త.. అప్పు కోసం వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లక్కర్లేదు.. కేంద్రం వెబ్‌సైట్‌లో తక్కువ వడ్డీకే లోన్!

కేంద్రం Central News భారత్ ప్రతినిధి : దేశంలో రైతులు పొలంలో కాలు పెట్టే ముందు.. వడ్డీ వ్యాపారుల గడప తొక్కుతుంటారు. అలాంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చిన్న, సన్నకారు రైతులు చాలా మంది అధిక వడ్డీకి అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తుంటే.. ఇంకొందరేమో భార్య నగ తాకట్టు పెట్టి సాగు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి వీరిని కాపాడేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాయి. అయినా పూర్తిస్థాయిలో ఫలితం దక్కట్లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ శుభవార్త చెప్పింది. అన్నదాతకు తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చేందుకు కొత్త పోర్టల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అదే పీఎం కిసాన్ రిన్ పోర్టల్. కొద్ది రోజుల కిందట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దీనిని లాంఛ్ చేశారు. రైతులకు కేంద్రం అందిస్తున్న పలు పథకాలు సహా లోన్లు, వాటి వడ్డీ రేట్లు సహా అన్ని వివరాల్ని కిసాన్ రిన్ పోర్టల్ అందిస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం ద్వారా రైతులు లోన్లు పొందే వీలు కల్పిస్తోంది. ఈ పోర్టల్‌ ద్వారానే రైతులు ఇప్పుడు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.ఇప్పటివరకు రైతులకు లోన్లు మంజూరు చేసేందుకు బ్యాంకులు తప్ప మరే డిజిటల్ ప్లాట్‌ఫాం అందుబాటులో లేదు. రిన్ పోర్టల్‌లో ఇప్పుడు రైతుల పూర్తి డేటా, లోన్ల మంజూరు, 

          వడ్డీ రాయితీ క్లెయిం చేసుకోవడం వంటివి ఉన్నాయి. అన్నదాత ఇకపై బ్యాంకులకు వెళ్లకుండానే ఈ వెబ్‌సైట్ నుంచి లోన్ పొందొచ్చు. 97 కమర్షియల్, 58 రీజినల్ రూరల్ బ్యాంకులు, 512 సహకార బ్యాంకులు లోన్లు అందించేందుకు ఈ పోర్టల్‌లో భాగస్వామ్యమయ్యాయి. పూర్తి వివరాల కోసం https://fasalrin.gov.in/ వెబ్‌సైట్ సందర్శించండి.మార్చి 30 నాటికి 7.35 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. వీటి ద్వారా ఇప్పటికే రూ. 8.85 లక్షల కోట్ల మేర లోన్లు మంజూరయ్యాయి. పీఎం కిసాన్ స్కీంలో భాగంగా.. కిసాన్ క్రెడిట్ కార్డుతో లోన్లు తీసుకోని వారికి.. ఈ పథకం గురించి తెలియజెప్పేందుకు కేంద్రం.. ఘర్ ఘర్ కేసీసీ అభియాన్ పేరిట ఇంటింటి ప్రచారం ప్రారంభించింది. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీంతో సబ్సిడీ వడ్డీ రేటుకే రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు.మరోవైపు కేంద్రం రైతులను ఆదుకునేందుకు అర్హులైన వారికి పంట సాయంగా ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. దీనిని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున అందిస్తోంది. ఇప్పటివరకు 14 విడతల డబ్బులు రైతుల అకౌంట్లలో పడగా.. ఇప్పుడు 15వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం...
* విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు శుభవార్త.. అప్పు కోసం వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లక్కర్లేదు.. కేంద్రం వెబ్‌సైట్‌లో తక్కువ వడ్డీకే లోన్ ఇక్కడ క్లిక్ చేయండి
* సంక్షేమ ప్రభుత్వానికి స‌పోర్టు..తాండూరులో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్లాపూర్ లో సారా పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies