అక్రమంగా మద్యని విక్రయిస్తున్నా వారి కేసు
బషీరాబాద్ Basheerabad News : ఎన్నికల సమయంలో అక్రమంగా మధ్యాన్ని విక్రయిస్తున్నారు. ఇట్టి సమాచారం తెలుసుకున్నా పోలీసులు వెంటనే వెళ్లి మద్యాన్ని సీజ్ చేశారు.ఎస్ఐ వేణు గోపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో రెడ్డి ఘనపూర్, గట్టిగా కలాం, నావల్గా గ్రామాలలో కొందరు వ్యక్తులు అక్రమంగా మధ్యాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్ళగా నవల్గా గ్రామం నందు పరుశురాములు s/o: లక్ష్మయ్య, వయస్సు:35 సంవత్సరాలు అను వ్యక్తి వద్ద 9840/- విలువచేసే మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది, రెడ్డి ఘనపూర్ గ్రామానికి చెందిన సుదర్శన్ s/o చంద్రయ్య, వయస్సు: 35 సంవత్సరాలు, వద్ద 4160/- రూపాయలు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గొట్టియకలాన్ గ్రామానికి చెందిన బాలయ్య s/o: ఫకీరప్ప, వయస్సు:45 సంవత్సరాలు, వద్ద 5440/- విలువచేసే మద్యం సీజ్ చేయడం జరిగింది. మొత్తం 19940/- రూపాయలు విలువచేసే 40 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వారిపై బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నందు కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.