కొత్లాపూర్ లో సారా పట్టివేత
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎస్పీ ఆదేశాల నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మండలంలో పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బృందాలు ప్రత్యేకంగా ఉండడంతో శుక్రవారం రోజు నావాంద్గి చెక్ పోస్ట్ వద్ద పోలీసు తనిఖీల్లో భాగంగా సుబ్బారావు అనే వ్యక్తి హైదరాబాద్ నివాసి వద్ద నుండి రూ 67 వేల ఐదు వందలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన బద్య నాయక్ S/O పుణ్యానాయక్ అక్రమంగా సారాయి నిలువ చేసి అమ్ముతున్నారు. ఇట్టి సమాచారం తెలుసుకున్నా పోలీసులు తనిఖీ చేయగా తన దగ్గర 10 లీటర్లు సారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.