సంక్షేమ ప్రభుత్వానికి సపోర్టు..తాండూరులో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తాండూరు మండలం సిరిగిరిపేట గ్రామస్థులు..పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామస్థులు, టౌన్ లోని 15వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు.తాండూరులో అభివృద్ధి, సంక్షేమం దూకుడు మీదుంది.. దీంతో చాలామంది సీఎం కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి సపోర్టుగా నిలిచేందుకు బీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాండూరు మండలంలోని సిరిగిరిపేట గ్రామానికి చెందిన దాదాపు 50 మందికి పైగా , పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన 50 మంది , తాండూరు టౌన్ 15వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ గూటికి చేరారు. వారిని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని.. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయన్నారు. తాండూరులో బంపర్ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.