Type Here to Get Search Results !

Sports Ad

ఎడ్యుకేషన్​ లోన్​ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ! Want an education loan?.. But know these things!


 ఎడ్యుకేషన్​ లోన్​ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి !

Education Loan For Abroad Studies : చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యను విదేశాల్లో చదివేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఇతర దేశాలకు వెళ్లి విద్యను అభ్యసించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.అందుకే విద్యారుణం తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే ఈ రుణాలు తీసుకునేముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా?విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అక్కడకు వెళ్లేందుకు ఎంతటి ఖర్చునైనా భరించడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి ఏడాది విదేశాలకు వెళ్లి చదివే భారతీయ విద్యార్థుల 

        సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య 18 లక్షలకు చేరుకుంటుందంటే విదేశీ విద్యకు ఎంతటి డిమాండ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే విదేశీ విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకోసం చాలా మంది విద్యార్థులు ముందుగా ఆశ్రయించేది బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు. అయితే ఇవి అందించే విద్యా రుణాలు (Education Loan For Students) తీసుకునే ముందు.. కొన్ని ముఖ్యమైన విషయాలను కచ్చితంగా పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Education Loan Process : విదేశాలకు వెళ్లే ముందు చాలా మంది విద్యార్థులు.. కోర్సులు, విశ్వవిద్యాలయాల ఎంపిక లాంటి అంశాలను మాత్రమే చూస్తారు. ఇందు కోసం అయ్యే ఖర్చుల గురించి కూడా ముందే అంచనా వేసుకుంటారు. అయితే పెరుగుతున్న విద్యా ద్రవ్యోల్బణం కారణంగా విదేశాల్లో చదువుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇది భవిష్యత్తులో రుణం తిరిగి చెల్లించే సమయంలో మనల్ని ఆర్థికంగా ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే విద్యారుణాల విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.ఖర్చులను అంచనా వేయండి 

Foreign Education Loan Calculator : విదేశాల్లో మనం చేసే కోర్సుకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని ముందే అంచనా వేసుకోవాలి. ఇందుకోసం అప్పటికే ఆ దేశంలో చదవిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. కేవలం కోర్సుకు అయ్యే ఖర్చు మాత్రమే కాకుండా ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకోండి. అందుకు అనుగుణంగా రుణదాతల నుంచి రుణం పొందండి. అయితే ఇందుకోసం కొన్ని రుణసంస్థలు ఖర్చును అంచనా వేసేందుకు ఉపయోగపడే కాలిక్యులేటర్ల (Student Loan Calculator)ను అందిస్తున్నారు. వాటి సాయం తీసుకోవచ్చు.అవగాహన తప్పనిసరి 

Education Loan : ఎడ్యుకేషన్​ లోన్​ ఎంచుకునే ముందు సొంతంగా కొంత పరిశోధన చేయాలి. ఇంతకు ముందు రుణాలు తీసుకున్న బంధువులు లేదా స్నేహితులతో మాట్లాడాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విషయంలో విద్యార్థులకు సహకారం అందిస్తాయి. విద్యా రుణాల గురించి, అందులో ఉండే ప్రక్రియల గురించి అర్థం చేసుకోవడంలో ఈ సలహాలు ఉపయోగపడతాయి. రుణం కోసం దరఖాస్తు చేసేముందు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అలాంటి సంస్థలనే ఎంచుకోండి 

Foreign Education Loan : విద్యార్థులు విద్యా రుణాన్ని (Education Loan Tips) తీసుకునే ముందు కోర్సుకు మాత్రమే అయ్యే ఖర్చులే కాకుండా ఇతర అనుబంధ ఖర్చులను కూడా అంచనా వేయాలి. ఇందుకోసం మీరు తీసుకునే రుణం వీటికి కూడా వర్తించేలా ఉండాలి. ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, ట్యూషన్​ ఫీజులు, ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలు సహా ఇతర ఖర్చులను కూడా అందించే రుణసంస్థలనే ఎంచుకోవాలి.రేట్లను మాత్రమే కాదు

Student Loan Interest Rates : ఇతర రుణాలతో పోలిస్తే విద్యా రుణాలు ప్రత్యేకమైనవి. వీటిని అందించేందుకు రుణదాతలు కచ్చితమైన విధానాలను పాటిస్తాయి. అందుకే రుణదాతలను ఎంచుకునేటప్పుడు చేసే చిన్న పొరపాటులు దీర్ఘకాలంలో మనకే భారంగా మారవచ్చు. అందువల్ల కేవలం వడ్డీ రేట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవద్దు. లోన్​తో పాటు బ్యాంకులు అందించే ఇతర ప్రయోజనాలను కూడా చూసుకోండి.ఇలాంటి రుణసంస్థల ఎంపిక మంచిది

Education Loan Companies : కొన్ని రుణసంస్థలు విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటాయి. మీరు ఎంచుకునే కాలేజీ లేదా యూనివర్సిటీతో కూడా వీరికి మంచి భాగస్వామ్యం ఉందో, లేదో తెలుసుకోండి. ఒక వేళ ఉంటే.. ఆ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, మీ అర్హతను అనుసరించి సులభంగా రుణాలు మంజూరు అవుతాయి.ఇది కూడా ముఖ్యమే

Student Loan Calculator : విద్యా రుణాలను తీసుకునేటప్పుడు వాటిని ఎంత కాలం కొనసాగించాలనుకుంటున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. అందుకే విద్యార్థులు తమకు అనువైన కాల వ్యవధిని ఎంచుకోవాలి. దీనికోసం ముందుగానే బ్యాంకులతో చర్చించడం ముఖ్యం. మారటోరియం వ్యవధిలో విద్యార్థులు సాధారణ/ పాక్షిక వడ్డీని చెల్లిచడం మంచిది. దీనితో విద్యార్థిపై వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

మరిన్ని వార్తల కోసం... 
* రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 15వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇక్కడ క్లిక్ చేయండి
* 'డెంగీ' ప్రమాద ఘంటికలు ఇక్కడ క్లిక్ చేయండి
* నిరుద్యోగులకు నిరాశే...! ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు సూర్య గ్రహణం వెరీ వెరీ స్పెషల్.. ఇలాంటి గ్రహణం మళ్ళీ చూడాలంటే 23 ఏళ్లు ఆగాల్సిందే ఇక్కడ క్లిక్ చేయండి
* ఎడ్యుకేషన్​ లోన్​ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ! ఇక్కడ క్లిక్ చేయండ
* స్పీడ్​ పెంచిన పార్టీలు...ప్రచారం వ్యూహాల్లో లీడర్లు ఇక్కడ క్లిక్ చేయండి



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies