3.22 కోట్లకు చేరిన ఓటర్లు
* నెల రోజుల్లో 4.71 లక్షల మంది నమోదు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య శుక్రవారం నాటికి 3,22,04,148కి పెరిగింది. సుమారు నెల రోజుల వ్యవధిలో 4,71,421 మంది ఓటర్లు పెరిగారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టిన అధికారులు గత నెల నాలుగో తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. అప్పటికి రాష్ట్రంలో 3,17,32,727 మంది ఓటర్లు నమోదయ్యారు. గత నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఓటర్ల నమోదుకు గడువు అక్టోబరు 31వ తేదీన ముగిసింది. ఆలోగా ఓటు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సుమారు 10 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. మార్పులు, చేర్పులు, సవరణ, తొలగింపుల ప్రక్రియను ఎన్నికల సంఘం గత నెల పదో తేదీనే నిలుపుదల చేసింది. కేవలం ఓటు నమోదు దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించింది. సింహభాగం దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులను ఈ నెల పదో తేదీ వరకు పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు.30-60 ఏళ్ల వారే అధికం.రాష్ట్రంలోని ఓటర్లలో 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులే.