గౌతాపూర్ లో భారాసా శ్రేణుల ప్రచార హోరు..
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండల గౌతాపూర్ గ్రామంలో భారాస శ్రేణులు నూతనోత్సాహంతో కదం తొక్కారు. గులాబీ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు చేసిన అభివృద్ది పనులను ప్రజానీకానికి తెల్పుతూ ముందుకు దూసుకువెళ్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని తాండూరు నియోజికవర్గం అభివృద్ధి చెందాలంటే ధర్శనికథ కలిగిన యువ నాయకుడు రోహిత్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తాండూరు నియోజికవర్గ ప్రజలు భారసా కే ఓటు వెయ్యాలని జెడ్పీటీసీ ప్రమొదిని జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సాయిరెడ్డి పేర్కొన్నారు. సామాజిక న్యాయం మహిళా సాధికారికత భారస్ వల్లే సాధ్యమవతుందని నియోజికవర్గ మహిళా అధ్యక్షురాలు శకుంతల అన్నారు. ఇంటింటి ప్రచారంలో యువ నాయకులు రాజు గౌడ్, గ్రామ అధ్యక్షులు దాస్తయ్య, మైనారిటీ నాయకులు రషీద్ పాషా పాల్గోని గౌతాపూర్లో ప్రచారాన్ని హోరెత్తించారు.