కోటపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు
కోటపల్లి Kotapalli News భారత్ ప్రతినిధి : కోటపల్లి మండల కేంద్రంలో తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోటపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు రోహిత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మరియు టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పింఛన్ ను పెంచడం జరుగుతుంది, భూమిలేని నిరుపేదలకు కెసిఆర్ బీమా ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం అందించడం రైతుబంధు 16 వేల రూపాయలు ఇవ్వడం ఆరోగ్య రక్ష కింద పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలా పథకాలు అమలు చేస్తారు బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వివరిస్తూ ప్రజలను రోహిత్ రెడ్డి గారికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.