Type Here to Get Search Results !

Sports Ad

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కు ఫిర్యాదు చేసే మొబైల్ యాప్ సి-విజిల్ బ్రహ్మాస్త్రం C-Whistle Brahmastram is a mobile app for reporting violations of the Election Code of Conduct


ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కు ఫిర్యాదు చేసే మొబైల్ యాప్ సి-విజిల్ బ్రహ్మాస్త్రం

జాతీయ National News భారత్ ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన కొత్త C-VIGIL యాప్ ఈ అన్ని ఖాళీలను పూరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఫిర్యాదు స్వీకరణ, సత్వర పరిష్కార వ్యవస్థను రూపొందించడానికి C-VIGIL అనేది ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, వ్యయ ఉల్లంఘనలను నివేదించడానికి పౌరుల కోసం ఒక వినూత్న మొబైల్ యాప్ అప్లికేషన్  C-VIGIL అంటే విజిలెంట్ సిటిజన్ ఇది స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో పౌరులు పోషించగల క్రియాశీలక బాధ్యతాయుతమైన పాత్రను నొక్కి చెబుతుంది.ఫోటో, వీడియో అప్లోడ్ చేసే సమయంలో ఫోన్లో జిపిఆర్ఎస్ ఆన్ చేసి ఉండాలి, ఫిర్యాదు చేసే వ్యక్తి తమ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు గ్రూప్ లో ఉంటాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినప్పుడు ఫోటో కానీ రెండు నిమిషాల నిడివి తో ఉన్న వీడియోలు కానీ యాప్ లో అప్లోడ్ చేయాలి. యాప్ ద్వారా పంపిణీ వివరాలు నేరుగా జిల్లా ఎన్నికల అధికారికి చేరుతాయి. అక్కడ క్షేత్రస్థాయిలో 24 గంటల పాటు పనిచేసే అందుబాటులో ఉండే సిబ్బంది అధికారులకు సిబ్బందికి యాప్ లో వచ్చిన ఫిర్యాదులను సంబంధించిన బృందాలకు పంపించి వంద నిమిషాల్లో పరిష్కరించి మీకు కేటాయించిన ఐ డి కి తిరిగి పంపిస్తారు.

ఉల్లంఘన అంశాలు :

ఓట్ల కోసం అభ్యర్థులు వారి అనుచరులు భౌతికంగా,  మానసికంగా భయాందోళనకు గురిచేయడం.

బహిరంగ సమావేశాల్లో విద్వేషపూరిత ప్రసంగాలతో ఓటర్లను రెచ్చగొట్టడం.

ఓటర్లను పప్రలోభాలకు పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ.

ప్రచార గడువు ముగిసిన తర్వాత సైతం స్పీకర్లు, ప్రలోభాల్లో భాగంగా వస్తువులు, సామాగ్రి పంపిణీ.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో బాధ్యత రహితంగా పని చేయడం. ఎన్నికల ప్రచార నిబంధనలు ఉల్లంఘన.

పై అంశాలను పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక అంశంపై ఉల్లంఘన జరిగిన ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగేందుకు దోహదపడిన వారు అవుతారు.

మరిన్ని వార్తల కోసం...
* రైతులకు గుడ్ న్యూస్ : ‘పిఎం కిసాన్’ 15 నే కంటిన్యూగా డబ్బు విడుదలకు ముహూర్త ఫిక్స్..! ఇక్కడ క్లిక్ చేయండి
* ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కు ఫిర్యాదు చేసే మొబైల్ యాప్ సి-విజిల్ బ్రహ్మాస్త్రం ఇక్కడ క్లిక్ చేయండి
* చౌక వడ్డీకి రూ.10 లక్షలు రుణం.. మోదీ సర్కార్ సదవకాశం.. వినియోగించుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* గౌతాపూర్ లో భారాసా శ్రేణుల ప్రచార హోరు.. ఇక్కడ క్లిక్ చేయండి
* రోహితన్నకు మద్దతు తెలిపిన పెర్కంపల్లి యువత ఇక్కడ క్లిక్ చేయం
డి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies