Type Here to Get Search Results !

Sports Ad

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్‌ Central Teacher Eligibility Test Notification


 సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్‌

ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : సెంట్రల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)- జనవరి 2024 నోటిఫికేషన్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎ్‌సఈ) విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ఏటా రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ స్కోరును కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష విధానం : పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం, రెండో పేపర్‌ను ఆరు నుంచి తొమ్మిది తరగతుల వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్‌ 

        స్కోరు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అర్హతలు :పేపర్‌-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.పేపర్‌-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/బ్యాచిలర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ)/బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(బీఈఎల్‌ఈడీ)/బీఎస్సీఈడీ/బీఏఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్‌ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్‌ 1, 2 రెండూ); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.500(పేపర్‌ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్‌ 1, 2 రెండూ) తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 23 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 2024 జనవరి 21 వెబ్‌సైట్‌ : https://ctet.nic.in/

మరిన్ని వార్తల కోసం...  
* 70 రూపాయల పెట్టుబడితో 3 లక్షలు.. అదిరిపోయే స్కీమ్.. ఇక్కడ క్లిక్ చేయండి
* సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* పదే, పదే ఫోన్ చూస్తుందని యువతిని తండ్రి తిట్టడంతో మనస్తాపానికిగురై యువతి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ ఎన్నికల్లో నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి 
* సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన.. ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies