మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డిని గెలిపించాలి సీఎం కేసీఆర్
* తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది
* ప్రజలు మోసపోవద్దు
* తెలంగాణ కు కాంగ్రెస్ శత్రువు
* కాంగ్రెస్ ను నమ్మితే మళ్ళీ కరువు కాలం
* తాండూరు అభివృద్ధి చేసే బాధ్యత నాది
* తాండూరులో ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్
తాండూర్ Tandur News : వికారాబాద్ జిల్లా బుధవారం తాండూరు పట్టణంలోని విలిమున్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ రాలేదని వేరే దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. తెలంగాణలో మూడోసారి ఎన్నికలు సర్వసాధారణమని ప్రజలు మోసపోవద్దన్నారు. పార్టీకి ఒకరు నిలబడతారని, అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలని తెలిపారు.తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిన పాపం కాంగ్రెస్ దే అని విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ కు కాంగ్రెస్ శత్రువన్నారు.15 ఏళ్ల పాటు ఏడిపించారని ప్రజా పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేసింది చూస్తున్నారని తెలిపారు. అల్లా దయతో తెలంగాణ సాధ్యం అయింది. అల్లా దయతో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ నిర్లక్షంతో మత విద్వేషాలు జరిగాయి.బీఆర్ఎస్ హయాంలో ఒక్క మత ఘర్షణ జరగలేదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బయటపెట్టిన నిజాయితీ వ్యక్తి అని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనించాలన్నారు.
సభలో మాట్లాడుతున్న పైలట్ రోహిత్ రెడ్డి
ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన భారీ ప్రజలు
ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అతిపెద్ద కోటిపల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.కోటిపల్లి ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు మంజూరు చేయాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి చేశారు.తాండూర్ నియోజక వర్గంలోని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.నేను తాండూర్ బిడ్డను మీ బిడ్డను తాండూర్ ను అభివృది చేయాలనీ చిత్తశుద్ధి ఉంది.తాండూర్ అభివృదిని అడ్డుకోవాలని కుట్రలు జరుగుతున్నాయి.రైతుల కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ ఇలా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి కోసం రోహిత్ రెడ్డి నిరంతరం కృషి చేశారని అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో రోహిత్ రెడ్డి గెలిపించాలని ఆయన కోరారు.ఈ యొక్క కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులు,నాయకులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు తదితరులు పాల్కొన్నారు.