Type Here to Get Search Results !

Sports Ad

హోరాహోరీ ప్రచారంతో దుమ్ములేపుతున్న బిసివై పార్టీ ఎమ్మెల్యే in Medical


 హోరాహోరీ ప్రచారంతో దుమ్ములేపుతున్న బిసివై పార్టీ ఎమ్మెల్యే 

మేడ్చల్ Medical News భారత్ ప్రతినిధి :  మేడ్చల్ నియోజకవర్గం గడ్డ మీద హోరాహోరీ ప్రచారంతో దుమ్ములేపుతున్న బి సి వై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజల మద్దతు. సోమవారం రోజున భారత చైతన్య యువజన పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో బోడె రామచంద్ర యాదవ్ గారి ఆదేశాలమేరకు "పల్లె పల్లెకు బి.సి.వై పార్టీ -గడప గడపకు మీ వెంకటేశ్వర్లుయాదవ్"కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున జవహర్ నగర్ కార్పొరేషన్, చెన్నపూర్,అంబేద్కర్ నగర్,నాగారం,దమ్మయిగూడా,పరిధిలో అన్ని కాలనీలలో విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.ఆయా కాలనీలలోని ప్రజలు బి.సి.వై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారికి భారీఏత్తునమద్దత్తు తెలుపుతూ స్వాగతం పలికారు.అనంతరం ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లు దండుకుని  వారి జీవితాలను గాలికి వదిలేశాయని ఉపాధి లేక ఆకలి కేకలతో ప్రజలు అలమటిస్తుంటే  ఈ పార్టీల అగ్రనేతలు రాజకీయ రాక్షస క్రీడలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని ప్రజలనుంచి  దోచుకున్న డబ్బుతో ఆస్తుల కంటే ,ధనం కంటే విలువైన వజ్రాయుధం లాంటి మీ ఓటు కొని మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నయని, దయచేసి మోసపోవద్దని సమాజంపట్లా భాధ్యత కలిగి నిరంతరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆలోచిస్తు కృషీ చేస్తున్న వ్యక్తీ బోడే రాంచంద్రయాదవ్ గారు. వారి నాయకత్వంలో భారత చైతన్య యువజన 

       పార్టీని ఏర్పాటు చేసుకుని రైతు కు ఓటేద్దాం -భవితకు బాటేద్దాం అనే నినాదంతో వచ్చామని మీకు సేవ చేసుకునే ఒక్క అవకాశం ఇస్తే  ఈ మేడ్చల్ జిల్లా అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా అని ,రైతే రాజు అని రైతులను ఈ పార్టీలు మోసం చేశాయనీ, అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ బద్ధమైన పాలనను అందించాలని, అద్భుతమైన మేనిఫెస్టోతో బి.సి.వై పార్టీ మీ ముందుకు వచ్చిందని,బి.సి లకు చట్టసభల్లో 50% సీట్లు ఇప్పటివరకు చట్టసభలు వెళ్ళని కులాలకు ప్రాధాన్యం చట్టసభల్లో బి.సి లకు రిజర్వేషన్ల కోసం పోరాటం, అన్ని కులాల గణన చేసి సంఖ్య ఆధారంగా ప్రాధాన్యత బి.సి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు, రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధిని కల్పిస్తామని, ప్రతి కుటుంబానికి ఒక పాడియావును అందించి ఆరోగ్య ఆర్థిక పరిపుష్టిని ప్రతి కుటుంబానికి చేరువ చేస్తామని ఇలాంటి అనేక అద్భుతమైన అంశాలతో పేదరికం నిరుద్యోగం లేని మేడ్చల్ జిల్లాగా మారుస్తామని ,30వ తేదీన జరిగే ఎన్నికల్లో చేరకు రైతు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో బి.సి.వై పార్టీ అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారిని గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంజి యాదవ్, వెంకట్ యాదవ్, చంద్ర యాదవ్,సలీమ్ ,గిడ్డ యాదవ్, సాయికుమార్, నితీష్ మహమ్మద్ పాషా, రమేష్, ఎల్లం, కుమార్ యాదవ్, సత్యనారాయణ, సతీష్, శ్రీనివాస్, సరస్వతి, మరియు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies