బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి గారి సమక్షంలో కోటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సునీల్ కుమార్ మరియు నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువకులు 20 మంది రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ మరియు రోహిత్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని చూసి యువత కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం అని యువత ఏకం కావడం జరిగింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆనంద్,గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, కోటపల్లి క్లస్టర్ ఇంచార్జ్ రవి గౌడ్, సీనియర్ నాయకులు కావలి అనంతయ్య, యువజన నాయకులు గడ్డం అనిల్ కుమార్, ఏ. నరసింహులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.