Type Here to Get Search Results !

Sports Ad

మీ ఆశీర్వాద బలమే విజయానికి పునాది.. The strength of your blessing is the foundation of success.

మీ ఆశీర్వాద బలమే విజయానికి పునాది.. 

తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజా ర్టీతో గెలిపించాలని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి కోరారు. మంగళవారం తాండూరు పట్టణంలోని 27వ వార్డులో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సతీమణి ఆర్తి రెడ్డి చేసిన ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వార్డులో ఆర్తీ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ కరపత్రాలను పంచి కారు గుర్తును గుర్తించుకోవాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, యువకులు అభిమానంతో ఓటేసి ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలన్నారు. కాంగ్రెస్ మాట లను నమ్మి దగా పడి ఇబ్బంది పడద్దని సూచించారు. ప్రజా ఆశీర్వాదమే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి, కౌన్సిలర్ సంగీత ఠాకుర్ తదితరులు పాల్గొన్నారు.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies