తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయింది. ఈ నెల 10 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు.ఎన్నికల నోటిఫికేషన్ - ముఖ్య తేదీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ - నవంబరు 3, 2023 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - నవంబరు 10, 2023 నామినేషన్ల పరిశీలన - నవంబరు 13, 2023 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు - నవంబరు 15, 2023 పోలింగ్ తేదీ - నవంబరు 30, 2023 ఎన్నికల ఫలితాలు - డిసెంబర్ 3, 2023
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే :
• ఓటు హక్కు ఉన్న నియోజికవర్గంలో కాకుండా మరొక నియోజికవార్గం నుండి అభ్యర్థి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్లుగా ధృవీకరణ పత్రం సమర్పించాలి.
• ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజికవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ల పాత్రలు దాఖలు చేయవచ్చు.
• గుర్తింపు పొందిన రాష్ట్ర లేదా జాతీయ పార్టీ అభ్యర్థి కోసం అదే నియోజికవార్గంలో ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది.గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి లేదా స్వతంత్రత అభ్యర్థి కోసం అదే నియోజికవార్గంలో పది మంది ఓటర్లు ప్రతిపాదించల్సి ఉంటుంది.
• ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ జాయింట్ అకౌంట్లు తెరవొద్దు.ఒక్కో అభ్యర్థి పేరు మీద కేవలం ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి.
• ఎస్సీ ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వర్గాలకు చెందిన వారే ఉండాలి అందుకోసం కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
• సెక్యూరిటీ డిపాజిట్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించాలి.
• నామినేషన్ దాఖలు చేసే సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి.అందులో అభ్యర్థి వివరాలు,ఆస్తి వివరాలు తదితర వివరాలన్నీ సరినవిగా ఉండాలి.
• రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపలకి అభ్యర్థి వెంట కేవలం అయిదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది.
• అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే అర్హత కేవలం రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది.
• నామినేషన్లను పరిశీలించే సమయంలో అభర్ధితో పాటు ఎలక్షన్ ఏజెంట్,అభ్యర్థి ప్రతిపాదించిన వారిలో ఒకరు ( న్యాయవాది కూడా వెళ్లొచ్చు ).
• నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఊరేగింపు వంటివి అపలి.
• ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థి ప్రతిపాదించిన వ్యక్తి నామినేషన్ల సమయంలో లేకపోతే వారి నామినేషన్ తిరస్కరణకు గురి అవుతుంది.