ఇంటోనికి బయటోకి మధ్య యుద్ధం !!
* నేను తాండూర్ బిడ్డను మరోసారి అవకాశం ఇవ్వండి
* తాండూర్ లో వచ్చేది నేనే
* భారీగా తరలించిన ప్రజలు
* ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి,ఎంపీ రంజిత్ రెడ్డి,కార్య కర్తలు
తాండూరు Tandur News : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గురువారం రోజున ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ర్యాలీకి తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే నని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పంజుగుల రోహిత్ రెడ్డి నామినే షన్ దాఖలు రోడ్ విజయోత్సవ ర్యాలీ జనసంద్రంగా జరిగింది.నియోజక వర్గంలోని తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు రోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలుకు స్వచ్చందం గా బ్యాండు, డప్పులతో ఉత్సాహంగా తరలివచ్చారు.
రోహిత్ రెడ్డి ఇంట్లో పూజలు చేసి,బీఆర్ఎస్ రోడ్ కు హాజరై తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి, అన్ని మతాల పెద్దల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేశారు. తాండూరులోని తన స్వగృహం నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్చౌరస్తా, శివాజీచౌక్ మీదుగా ఆర్డీవో కార్యాలయం సమీపంలోని వీవీహెచ్ఎస్ పాఠశాల వరకు వేలాది మంది కార్యకర్తలు,అభిమానులతో కొనసాగింది.ర్యాలీ అనంతరం పైలెట్ రోహిత్ రెడ్డి ఆర్డీవో కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలు లెక్కచేయకుండా కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివి ధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు.తాండూరు పక్కనే ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజా సంక్షేమ పథకాలు లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఆగం అవుతున్నారు అని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే గెలుపు ఖాయం అయిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగించాలని కోరుకున్నారు. రాబోయే 30 తారీఖున కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాండూర్లో రోహిత్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలవనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైంట్ రోహిత్ రెడ్డి .నేను చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తాండూరులో ఎప్పుడు రానటువంటి అధిక మెజారిటీ నాకు వస్తుందని, నేను ఘన విజయం సాధిస్తానని అన్నారు. పార్టీలు మారే వారి గురించి, నాపై అనవసర ఆరోపణలు చేసేవారి గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.