ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది.సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87 లక్షల మంది పురుషులు కాగా 30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు.సాధారణంగా ఆర్టీసీలో 50 లక్షల మంది ప్రయాణికులు ఎక్కితే 18 కోట్లు ఉండే ఆదాయం సోమవారం 11.74 కోట్లు వచ్చింది.