హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము President of india Droupadi Murmu హైదరాబాద్ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి Chief Secretary (CS) to the State Government Shanti Kumari అధికారులను ఆదేశించారు.రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌కు శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రానున్న విషయం తెలిసిందే ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు తిరిగి ఈ నెల 23న దిల్లీకి వెళ్లనున్నారు.