Type Here to Get Search Results !

Sports Ad

మళ్లీ కరోనా షురూ... మాస్కులు తప్పనిసరి? Corona again... Masks are mandatory?


 మళ్లీ కరోనా షురూ... మాస్కులు తప్పనిసరి?

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.కరోనా వేరియంట్ అయిన JN.1 (COVID సబ్‌వేరియంట్ JN1) కేసులు పెరిగిపో తున్నాయి.తాజాగా బుధవారం కేరళ రాష్ట్రంలో కొత్తగా 74 కోవిడ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. దక్షిణ కన్నడ, మైసూరు జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కో బాధితుడు. బెంగళూరులో ఇవాళ కొత్తగా 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.హాసన్ 4, బెంగళూరు రూరల్ జిల్లాలో 4, చిక్కబల్లాపూర్ 3, మాండ్య, మైసూర్ జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో .

       కర్ణాటకలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది.ప్రభుత్వం. అల ఆలాగే బాధితులకు 7 రోజుల క్వారంటైన్‌ విధించింది. JN.1 పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో సిద్ధరామయ్య సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.అయితే కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అందించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 464, బెంగళూరులో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 376, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1.15%.కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంటువ్యాధుల నివారణకు తీసుకున్న కీలక నిర్ణయా లను ప్రస్తావించారు.ఈ మేరకు నిపుణులతో ఆయన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సోకిన వారు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాధి సోకిన వారికి 7 రోజుల సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని అధికారులు పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపవద్దని మంత్రి సూచించారు.

మరిన్ని వార్తల కోసం...
* రైతు భరోసా, గృహ జ్యోతి, రేపటి నుంచి దరఖాస్తులు ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ బ్రేకింగ్!!రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్!! ఇక్కడ క్లిక్ చేయండి
* మంచిర్యాల జిల్లాలో తల్లి కూతురు ఆత్మహత్య? ఇక్కడ క్లిక్ చేయండి
* మళ్లీ కరోనా షురూ... మాస్కులు తప్పనిసరి? ఇక్కడ క్లిక్ చేయండి
* పురుషుల కోసం ప్రత్యేక బస్సులు? ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies