Type Here to Get Search Results !

Sports Ad

మహిళలకు రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం Free travel for women in RTC buses from tomorrow in TS

 

మహిళలకు రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

* తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు, పలు కీలకమైన నిర్ణయాలు
* ఈనెల 9న సోనియా గాంధీ జన్మ దినోత్సవం 
* రేపు రెండు గ్యారెంటీలు అమలు
* ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం

హైదరాబాద్ Hyderabad News భారత్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం కొలువుదీరిన కొద్ది గంటల వ్యవధిలోనే డా.బిఆర్.అంబేద్కర్ సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు, పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రివర్గం మరో కీలకమైన అంశంగా విద్యుత్ రంగం పరిస్థితులపైన హాట్‌హాట్‌గా చర్చలు జరిపారని తెలిసింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క, మంత్రులు, సిఎస్ శాంతి కుమారి ఇతర శాఖల అధికారులు హాజ రైయ్యారు.ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ముందుగా సిఎంగా సచివాలయంలో బాధ్యతలు రేవంత్‌రెడ్డి స్వీకరించారు.సిఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. లోపల రేవంత్‌రెడ్డికి వేద పండితులు స్వాగతం పలికారు. తరువాత కేబినెట్ సమావేశం నిర్వహించి ఉచిత విద్యుత్, ఆరు గ్యారెంటీలపై మం త్రివర్గం చర్చించింది.

అనంతరం మీడియాతో మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 9న సోనియా గాంధీ జన్మ దినోత్సవం సందర్భంగా ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందిం చనున్నట్లు స్పష్టం చేశారు.రాబోయే ఐదేళ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తామని, శుక్రవారం రెండు గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చించనట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులుకు ఆదే శించినట్లు చెప్పారు.

2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయం రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కొనసా గిస్తామని,గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.

రైతులకు పెట్టుబడి సాయంపై కూడా చర్చిం చినట్లు, ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లతామని వెల్ల డించారు.మంత్రులకు శాఖల కేటాయింపులపై సిఎం, హైకమాండ్ నిర్ణయం తీ సుకుంటుందని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల విషయంపై కూడా చర్చించాని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీ లిస్తారన్నారు.

మరిన్ని వార్తల కోసం ...

* తెలంగాణ మహిళలకు రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక్కడ క్లిక్ చేయండి 

* సర్పంచుల పదవీ కాలం పూర్తి కానుంది ఇక్కడ క్లిక్ చేయండి
* మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ? ఇక్కడ క్లిక్ చేయండి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies