అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ(డిసెంబర్ 13) సాయంత్రం 5 గంటలకు ముగిసిన నామినేషన్ల గడువు ముగిసింది.కేవలం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై రేపు(డిసెంబర్ 14) అధికారికంగా అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాలకు నామినేషన్ వేశారాయన. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కేటీఆర్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, పలువురు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.అధికార, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఏకాభిప్రాయానికి రావడంతో స్పీకర్ ఎన్నికల లాంఛనం కానుంది. తెలంగాణ మూడో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.