ప్రజా పాలన దరఖాస్తుల ప్రారంభం
* మంతన్ గౌడ్ గ్రామంలో111 దరఖాస్తులు,నవాంద్గిలో 100కు పైగా
* ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్
* తాసిల్దార్ వెంకటస్వామి
* పలువురు అధికారులు,ప్రజలు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : గురువారం రోజున వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో అభయహస్తం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు గ్యారంటీలు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది అందులో రెండు గారెంటీలు చేయడం జరిగింది. నాలుగు గ్యారెంటీ కోసం ప్రజల వద్దకు ప్రజా పాలన అంటూ గ్రామాల్లోని టీం లీడర్ గా ప్రభుత్వ అధికారులు ఉన్నారు.ఈ నాలుగు గ్యారంటీలు ప్రజల దృష్టిలో పెట్టుకొని అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
తాసిల్దార్ వెంకటస్వామి మాట్లాడుతూ అరుహులైన ప్రతి కుటుంబానికి సమక్షేమ పథకాలను అందించడము ప్రభుత్వ లక్ష్యం.ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.మంతన్ గౌడ్ గ్రామపంచాయతీలో 111 దరఖాస్తులు,నవాంద్గిలో 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు టీం లీడర్ తాసిల్దార్ వెంకటస్వామి తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ ప్రజాపాలన చైర్మన్ అజయ్ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్,జిహెచ్ఎం టీచర్ హీర్యా నాయక్, ఏపీఎం పద్మారావు,పంచాయతీ రాజ్ వంశీకృష్ణ, సర్పంచ్ పట్లోళ్ల సత్యమ్మ దేవేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్,ఏఎన్ఎం శిరోమణి, ఆశా వర్కర్ ముని బాయి, పలువూరు అధికారులు పాల్గొన్నారు.