తాండూర్ ప్రజలు నా ప్రాణం.. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాడుతా
* ప్రజల కోసం పని చేయాలే తప్ప, కక్ష పూరితలు వద్దు
* ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
* అభివృద్ధి కోసం రూ.1670 కోట్ల నిధులు
* రైల్వే బ్రిడ్జి, ఇండస్ట్రియల్ పార్క్, మార్కెట్ యార్డు
* ఇచ్చిన హామీలను అమలు చేసి చూపెట్టాలని సవాలు
* బిఆర్స్ కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : బుధవారం రోజున తాండూర్ పట్టణంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నా హయాంలో జరిగిన అభివృద్ధి తాండూరు ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. రూ.1670 కోట్ల నిధులతో అన్ని విధాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నిధులు మంజూరు చేయిస్తే, కక్ష పూరిత రాజకీయాలతో అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుదన్నారు.
నియోజకవర్గంలో మేము తెచ్చిన పనులను , ప్రారంభమైన పనులను నిలిపి వేయాలని చూడటం అభివృద్ధిని అడ్డుకున్నట్లేనన్నారు. 40 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నా హయాంలో పూర్తి చేయాలని ఎంతో కష్టపడి నిధులు మంజూరు చేయించాను అన్నారు.కానీ అభివృద్ధి పనులను ఆపేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు విరమించుకోవాలని అన్నారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి, ఇండస్ట్రియల్ పార్క్, మార్కెట్ యార్డు నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకు వచ్చానన్నారు. ఒకవేళ మా విజ్ఞప్తిని కాదని,పనులను నిలిపివేస్తే తాండూరు ప్రజల ఆగ్రహావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోను కావాల్సి వస్తుందన్నారు.
ఇప్పటికే డిఎఫ్ఎంటి నిధులకు సంబంధించిన పనులను నిలిపివేయాలని తాండూర్ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోందన్నారు. ప్రజల కోసం పని చేయాలే తప్ప, కక్ష పూరిత రాజకీయాలు చేయరాదన్నారు.ఆరు గ్యారెంటీ లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇంత వరకు వాటిని అమలు చేయడం లేదన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 500 కు గ్యాస్ సిలిండర్, రూ. 2500 ప్రతి మహిళకు ఇస్తామన్నారనీ, ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నానన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, ఉచిత ప్రయాణం పేరుతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపెట్టాలని సవాలు విసిరారు.
నాకు ఓటు వేసిన అందరినీ త్వరలోనే కలుస్తానన్నారు. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తాండూరు ప్రజలకు, బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తకు అండగా ఇక్కడే ఉంటానన్నారు. నిరుత్సాహ పడనవసరం లేదని, ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని అది పూర్తి చేసి తీరుతామన్నారు.జనవరిలో నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన పర్యటిస్తానన్నారు.నియోజకవర్గ పార్టీ ఇంచార్జి గా ఆనవాయితీ ప్రకారం తానే ఉంటానన్నారు.
నమ్మక ద్రోహానికి పాల్పడిన వారు బాధ్యతలు చేపట్టనున్నట్లు చెప్పుకున్నా అదికుదరదన్నారు. పార్టీలో ఉంటూ నమ్మకద్రోహానికి పాల్పడిన ఎవరిని వదిలేది లేదన్నారు. ఈ విషయమై సాక్ష్యాధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ నెల 29 న సాయంత్రం 6 గంటలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని కోరుతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
* తాండూర్ ప్రజలు నా ప్రాణం.. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాడుతా ఇక్కడ క్లిక్ చేయండి
* పరీక్ష హాల్ టికెట్లు విడుదల డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* మళ్లీ కరోనా షురూ.. జర జాగ్రత్తగా !! ఇక్కడ క్లిక్ చేయండి