Type Here to Get Search Results !

Sports Ad

గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. Preparations for Gram Panchayat Elections

గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. 

* రిజర్వేషన్లు మారుతాయా...?
* పాత రిజర్వేషన్లు కొనసాగేనా...?

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31న వస్తుంది. 2024 ఫిబ్రవరి నుండి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావలసి ఉంటుంది. 2018 లో పాలకవర్గం రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒక కాలపరిమితి, మరొక 5 సంవత్సరాలకు 2  పర్యాయములు సర్పంచులు, వార్డు సభ్యులు 10 సంవత్సరాల కాలానికి ఓకే రిజర్వేషన్ కొనసాగుతుందని చట్టం చేయడం జరిగింది. ఈ విధానం రూపొందించిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వం గత ప్రభుత్వం రూపొందించిన10 సంవత్సరాల కాలపరిమితి మరియు రెండు పర్యాయాల రిజర్వేషన్ మారుస్తుందా? లేదా అనేది రాజకీయ నాయకుల సమాలోచన గ్రామపంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావాహులు ఆశతో రిజర్వేషన్ మారుతుందా? లేదా అని రాజకీయ నాయకులు సందిద్దo లో ఉన్నారు.

 ఎస్సీ ,ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్ ఆశావాహులు అవకాశం కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వద్ద 224 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు గురించి గవర్నర్ సంతకం కోసం ఫైల్ పెండింగ్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 224 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించిన పెండింగ్ ఫైల్ పై సంతకం పెడితే మొత్తం 12,769 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ గవర్నర్ సంతకం కానీ 224 నూతన గ్రామపంచాయతీలో ఏర్పాటు గురించిన అంశం పెండింగ్లో ఉంటే పాత గ్రామపంచాయతీలు అయిన 12,769 గ్రామపంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2024వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం గా మారుతుంది. ఎందుకనగా 2024 గ్రామపంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్తు ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఖాళీ అయినా శాసనమండలి సభ్యుల ఎన్నిక పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం... 
* నేటి నుండి 
రైతులందరికీ రైతు బంధు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి

*  ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సమీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
*  నేటి నుంచి తెలంగాణలో 'ప్రజావాణి' కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి 
* గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం ఇక్కడ క్లిక్ చేయండి 
* రేషన్ కార్డులపై కోటి ఆశలు ఇక్కడ క్లిక్ చేయండి

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies