మీ ఆరోగ్యం కోసం కొన్ని గృహ వైద్యాలు
మీ ఆరోగ్యం కోసం కొన్ని గృహ వైద్యాలు :-
1. బిపి తగ్గడానికి, బరువు తగ్గడానికి, చలవ చేయడానికి, మలబద్ధకం తగ్గడానికి ప్రతిరోజూ ఆనపకాయ జ్యూస్ త్రాగండి.
2. మీ షుగర్ తగ్గడానికి చిన్న కాకర కాయ, ఒక టమాటో, కీర దోసకాయ లను మిక్సీలో వేసి వచ్చిన జ్యూస్ త్రాగండి.
3. మీకు సయాటికా నొప్పి ఉంటె పారిజాతం ఆకుల కషాయం త్రాగండి.
4. మీకు నడుమునొప్పి, మోకాలు నొప్పి ఉంటె శొంఠి, మెంతులు, పసుపు లను పొడి చేసి ఆ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం వేడినీళ్ళతో పాటు పూటకు అరచెంచా చొప్పున వేసుకుని త్రాగండి.
5. మీ నడుము సన్నబడి బొజ్జ తగ్గాలి అంటే పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం లను ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి అరగ్లాసు అయ్యే వరకూ మరిగించి ఆ కషాయం త్రాగండి.
6. నిద్ర పట్టడం లేదు అనుకుంటే రాత్రి పడుకునే ముందు రెండు ముక్కుల లోనూ 5 - 5 చుక్కలు ఆవు నెయ్యి వేసుకోండి.
7. సైనస్ కూ, మైగ్రేన్ కూ కూడా ఇదే వైద్యం చేసుకోండి.
8. ఆస్తమాకు పాలల్లో పసుపు వేసుకుని త్రాగండి.
9. బరువు తగ్గాలి అంటే ప్రతి రోజూ గోధమ ఆర్క్ 20 - 40 మిల్లీ లీటర్లు అయిదు రెట్ల నీళ్ళల్లో వేసుకుని ఉదయం త్రాగండి.
10. ఆశ్వగంద ఆకులు ప్రతి రోజూ రోజుకు ఒకటి చొప్పున తిని వేడినీరు త్రాగితే నెలకు మూడు కిలోల బరువు తగ్గుతారు.
11. ABC జ్యూస్ ఒక ఆపిల్, ఒక బీట్ రూట్, ఒక కేరట్ లను మిక్సీలో వేసి ప్యూరీ గా చేసి (గుజ్జు) దానిని మీ ఉదయపు ఆహారం గా తీసుకోండి. అలా తినే టైం ఉండదు అనుకుంటే జ్యూస్ త్రాగండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచే ఒక సరికొత్త ఉపాయం.
ఈ చిట్కాలు మీరు పాటిస్తూ ఇతరులకూ చెప్పండి. దీనివలన మీరు ఒకరికి ఆరోగ్యం చేకూర్చిన వారు అవుతారు.