నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది గవర్నర్ తమిళి సై
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నియంతృత్వ పాలన పోక డల నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళ్ సై అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాం క్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని, అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని పాలన సాగిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు.తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన వారికి సభావేధికంగా నివాళులర్పిస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. మంత్రులు, ఎంఎల్ ఎలకు అభినందనలు తెలిపారు.ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతు న్నానని, ప్రజా సేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు.కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని గవర్నర్ తమిళిసై ప్రశంసించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక రించేందుకు ప్రజావాణి చేపట్టామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామన్నారు.తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని గవర్నర్ పేర్కొ న్నారు. త్వరలో మెగా డిఎస్ సి ప్రకటిస్తామన్నారు. తెలంగాణ పాలన దేశానికి ఆదర్శం కాబోతుందని కొనియాడారు.ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించామని, హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని పేర్కొన్నారు.