తుది దశకు చేరిన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం
శ్రీహరికోట Sriharikota News భారత్ ప్రతినిధి : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన సన్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం తుది దశకు చేరుకుంది.వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన వివరాలను ఆదిత్య ఎల్-1 భూమికి పంపించనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు శాటిలైట్ తన గమ్యస్థానానికి చేరుకుం టుందని తెలిపింది.గతేడాది సెప్టెంబర్ 2న ప్రయాణం మొదలుపెట్టిన ఆదిత్య ఎల్-1, 126 రోజుల పాటు ప్రయాణించి నిర్దేశిత లాగ్రేజియన్ పాయింట్ -1(L1)కి చేరనుంది.భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఎల్-1 పాయింట్ వద్ద హాలో కక్ష్యలో ఆదిత్య ఎల్-1 చేరనుంది. ఇక్కడ నుంచి ఆదిత్య ఎల్-1 సూర్యుడి గుట్టు విప్పేందుకు తనలో ఉన్న పరికరాలను వాడ నుంది.సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌరజ్వాలల వంటి విషయాలపై అధ్య యనం చేస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ అన్నారు. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 పూర్తి ఆరోగ్యం ఉందని ఇస్రో ప్రకటించింది.