Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ స్కామ్.. సర్కార్ చేతికి చిక్కిన కీలక ఆధారాలు..! A huge scam of Rs.1000 crores in Telangana.. Key evidence caught in Sarkar's hands..!


 తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ స్కామ్.. సర్కార్ చేతికి చిక్కిన కీలక ఆధారాలు..!

* కాలేజీల భవనాల నిర్మాణాల్లో
* అంచనాల తయారీలోనే అక్రమాలు
* నచ్చిన కంపెనీలకు అనుకూలంగా
* కార్పొరేషన్ చేపట్టిన పనుల్లో ఆదా
* గణపతి రెడ్డి పాత్రపై ఆరా..?

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గత సర్కారు హయాంలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తున్నది. అందులో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ కన్ స్ట్రక్షన్స్‌లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగినట్లు ఆధారాలు లభించాయని విశ్వసనీయంగా తెలిసింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు పెద్దలు.. అంచనాల తయారీలోనే అక్రమాలకు తెరలేపి, తామనుకున్న నిర్మాణ సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా టెండర్ నిబంధనలు రూపొందించినట్లు ప్రస్తుత ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.

17 కాలేజీల భవనాల నిర్మాణాల్లో

గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. ఇందుకోసం రూ. 3,062 కోట్లు కేటాయించింది. ఈ నిర్మాణాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు వస్తుండటంతో అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఏ పనుల్లో, ఎంత అవినీతి జరిగిందనే వివరాలు సేకరిస్తున్న సమయంలో విస్తుగొల్పే అంశాలు బహిర్గతమైనట్టు తెలిసింది. కేటాయించిన నిధుల్లో మూడోవంతు అంటే దాదాపు రూ. 1000 కోట్ల అవినీతి జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి.

పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే, అసలు విషయం బయటికి వస్తుందని అభిప్రాయపడ్డాయి. మహబూబ్ నగర్, సిద్దిపేట్, నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాలకు చెందిన బిల్డింగ్స్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
అంచనాల తయారీలోనే అక్రమాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాల్లో ఏ పనులకు ఎంత ఖర్చవుతుందో లెక్కలు ఉంటాయి. వాటినే షెడ్యూలు స్టాండర్డ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) అంటారు. ఆ లెక్కల ప్రకారమే నిర్మాణ సంస్థ పనులు చేయాలి. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణాల అంచనాలు తయారు చేసే సమయంలోనే అక్రమాలకు తెర లేపినట్టు గుర్తించారు. అంచనాల్లో నాన్ ఎస్ఎస్ఆర్ ఐటమ్స్ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున అంచనాలు పెరిగి, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఆధారాలు సేకరించారు.
నచ్చిన కంపెనీలకు అనుకూలంగా నిర్మాణ పనులు ఏ కాంట్రాక్టు సంస్థకు ఇవ్వాలో ముందుగానే డిసైడ్ చేసినట్టు అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ కంపెనీకి మాత్రమే కాంట్రాక్టు పనులు దక్కే విధంగా నిబంధనలు తయారు చేసినట్టు అధికార వర్గాల్లో టాక్ ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వ పనుల్లో నాన్ ఎస్ఎస్ఆర్ ఐటమ్స్‌తో పనులు చేసిన అనుభవం తప్పనిసరి చేస్తూ షరుతులు విధించారు. దీంతో ఇతర కాంట్రాక్టు సంస్థలకు కనీసం టెండర్ వేసే అర్హత కూడా లేకుండా పోయింది. చివరికి తమకు నచ్చిన నిర్మాణ సంస్థ టెండర్ వేయడం, వారికే పనులు దక్కడం అంత రూల్స్ ప్రకారం జరిగిపోయింది.కార్పొరేషన్ చేపట్టిన పనుల్లో ఆదా మెడికల్ డిపార్ట్ మెంట్‌లో జరిగే సివిల్ వర్క్స్ పనులను మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగిస్తుంటారు. కానీ 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కార్పొరేషన్‌కు ఇవ్వకుండా ఆర్ అండ్ బీకి అప్పగించారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో నిర్మాణ సంస్థలు 3 నుంచి 4 శాతం అదనంగా టెండర్లు వేశాయి. అదే సమయంలో మెడికల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఆస్పత్రులు, టీచింగ్ స్టాఫ్ భవనాల మరమ్మతుల కోసం సుమారు రూ. 3396 కోట్ల పనులు జరిగాయి. ఈ పనుల కోసం ఎస్ఎస్ఆర్ ఐటమ్స్ మేరకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో పాల్గొన్న సంస్థలు నిర్ధారించిన అంచనా మొత్తం కంటే సుమారు -3.5 శాతం కోట్ చేశాయి. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ. 115 కోట్లు ఆదా అయినట్టు తెలిసింది. గణపతి రెడ్డి పాత్రపై ఆరా..? ఆర్ అండ్ బీ ఈఎన్సీ ఐ. గణపతి రెడ్డి ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఆయన ఏడేండ్ల క్రితమే రిటైర్ అయ్యారు. అయినా ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఆర్ అండ్ బీ చేపట్టిన పనుల్లో ఆయన పాత్ర ఎంత మేరకు ఉందనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అంచనాల తయారీలో ఆయన పాత్ర ఏమిటి..? ఎవరి సూచనల మేరకు టెండర్ నిబంధనలు తయారు చేశారు? అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఏ మేరకు ఉంది? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తల కోసం... 
* తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ స్కామ్.. సర్కార్ చేతికి చిక్కిన కీలక ఆధారాలు..! ఇక్కడ క్లిక్ చేయండి
* చక్కెరవ్యాధిని కంట్రోల్చేయగలిగే ఏకైకఔషధం జామాకాయ ఇక్కడ క్లిక్ చేయండి
* రాయితీ పెండింగ్ చలాన్లు మరోసారి ఘడువు పొడిగించం : పోలీస్ శాఖ ఇక్కడ క్లిక్ చేయండి
* కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies