Type Here to Get Search Results !

Sports Ad

12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు in kerala

12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు

కేరళ kerala News భారత్ ప్రతినిధి : ఈ రోజుల్లో ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారో ..ఎలా ఉంటున్నారో.. తల్లిదండ్రులు వారి మీద శ్రద్ద పెట్టకపోతే..చాలా దారుణాలు జరుగుతున్న సమాజం ఇది...12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు రోజు రోజుకీ బంధాలకు విలువ లేకుండా పోతోంది. అనైతిక సంబంధాలు పలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అది కూడా తన సోదరుడి వలన గర్భవతి కావడంతో తల్లిదండ్రులు కోట్లు మెట్లు ఎక్కారు. తమ కూతురు గర్భాన్ని విచ్చితి చేయమంటూ హై కోర్టుని ఆశ్రయించారు.ఈ అనైతిక ఘటన కేరళలో చోటు చేసుకుంది.మైనర్ సోదరుడి వలన గర్భవతి అయిన 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు కేరళ హై కోర్టుని ఆశ్రయించారు.చిన్న వయసులోనే గర్భం దాల్చిన తమ కూతురికి అబార్షన్‌ చేయాలని బాలిక 

       తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుని విచారించిన కోర్టు వైద్యుల రిపోర్ట్స్ ని పరిగణలోకి తీసుకుని బాలిక గర్భం దాల్చి ఇప్పటికే 34 వారాలు అయింది.. పిండి పూర్తిగా అభివృద్ధి చెంది శిశివు రూపం సంతరించుకుందని కోర్ట్ పేర్కొంది. అంతేకాదు త్వరలో డెలివరీ జరిగే చాన్స్ ఉన్న ఈ సమయంలో అబార్షన్‌ చేయడం కష్టమన్న హైకోర్టు బాలిక తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టివేసింది.అయితే ఈ దశలో అబార్షన్ చేయడం అసాధ్యమని చెబుతూనే కాకపోతే, సిజేరియన్ ద్వారా లేదా సాధారణ ప్రసవం ద్వారా బిడ్డ పుట్టేందుకు అనుమతించాలని కోర్టు పేర్కొంది. డెలివరీ విషయంలో తుది నిర్ణయం వైద్య నిపుణులకు వదిలివేసినట్లు హైకోర్టు తెలిపింది. శిశివు జన్మించిన తర్వాత కోర్టు ఆ శిశివుకు రక్షణ కల్పిస్తుందని హమీనిచ్చింది.కోర్టులో బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు గర్భవతి అన్న సంగతి తమకు ముందు తెలియదని.. ఇటీవలే తెలిసిందని చెప్పారు. 

       అంతేకాదు తమ కూతురికి కేవలం 12 ఏళ్ళు.. కనుక ఈ వయసులో బిడ్డకు జన్మనిస్తే శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పారు. కనుక తమ కూతురుకి అబార్షన్ చేయించే అవకాశం ఇవ్వమని కోర్టుకు విన్నవించారు. అయితే తల్లిదండ్రుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. మరో 15 రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందని.. ఇప్పుడు అబర్షన్ చేస్తే తల్లిబిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న హై కోర్టు అబార్షన్‌ చేయడాని వీల్లేదని తీర్పు ఇచ్చింది.గర్భవతి అయిన  మైనర్‌ బాలికను గర్భవతి చేసిన సోదరుడికి దూరంగా ఉంచాలని సూచిస్తునే ఆ బాలికను  తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంచాలని జస్టిస్‌ దేవన్‌ రామచంద్రన్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి
* అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి : సిఎస్ శాంతి కుమారి ఇక్కడ క్లిక్ చేయండి 
* సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* 12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏప్రిల్‌లో టెట్‌! ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies