ఓటు నమోదుకు ఇష్టపడట్లే
* పట్టభద్రుల ఎన్నికలపై నిరాసక్తత
* ఓటు నమోదుకు మిగిలింది 18రోజులే
* నేటికీ నమోదు చేసుకుంది 53 వేలు మాత్రమే
* మూడేళ్ల కిందట ఓటేసిన వారి సంఖ్య 5 లక్షలపైనే
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఓటు హక్కు కోసం పట్టభద్రులు ఆసక్తి చూపించడం లేదు. మూడేళ్ల కిందట నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికలకు ఆయా పార్టీల నాయకులతో పాటు అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కు నమోదుకు ఆసక్తి చూపించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితులు మారడంతో ప్రస్తుత పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికపై ఓటర్లు ఆసక్తి చూపించడం లేదు. వెరసి ఈ స్థానంలో 12 జిల్లాల నుంచి 53 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 20 వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో అధికారులు నూతన ఓటర్ల నమోదుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నిక భారీ పోరును తలపించింది. పల్లా రాజేశ్వరర్‌రెడ్డి ప్రొఫెస ర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, వామపక్షాల అభ్యర్థి గా జయసారధి ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డారు. నోటిఫికేషన్‌కు ముందు నుంచే రాజకీయపక్షాలు తమ అభ్యర్థులు పొత్తులు పరోక్ష మద్ద తు వంటి అంశాలపై జోరుగా కసరత్తు చేశాయి. ఓటర్ల నమోదుకు ఎవరికి వారు పోటీ పడ్డారు. ఓటర్లను పోలింగ్ బూత్‌కు తరలించేందుకు అభ్యర్థులు, రాజకీయపక్షాలు అవిశ్రాంతంగా శ్రమించాయి. పోరు రసవత్తరంగా మారి నిరుద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేక త ఉన్నప్పటికీ పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించ గా విజయం సాధిస్తారు.అనుకున్న కోదండరాం మూడో స్థానానికి పరిమితం కాగా సైలంట్ ఓటింగ్ తో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలోకి వచ్చి వార్తల్లో నిలిచారు.పల్లా రాజీనామాతో ఆరేళ్లకు జరగాల్సిన ఎన్నిక మూడేళ్లకే అనివార్యమైంది.ఓటర్ల నమోదుకు తుదిగడువుకు మరో 18 రోజులే మిగిలి ఉండగా నేటికీ 53 వేల మందే దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్లు 20వేల మంది ఉండటం గమనార్హం.మూడేళ్లలో మారిన పొలిటికల్ సీన్ సరిగ్గా మూడేళ్ల కిందట రాజకీయం రంజుగా ఉంది.బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావడం.. ఆ సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు లేకపోవడం తో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి కనబరిచారు. నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతో బీఆర్‌ఎస్ అఽధికారంలోకి రాగా నోటిఫికేషన్లు లేక, నిరుద్యోగుల ఉద్యమాలను అణిచివేసేందుకు నాటి రాష్ట్రప్రభుత్వం యూనివర్సిటీలపై నిషేధం విధించగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేధావులు, యువత స్వరం వినిపించే ప్రయత్నం చేశాయి. ఆ ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకు న్న బీఆర్‌ఎస్ వారి పక్షాన అన్నివిధాలా సమర్ధుడైన పల్లా రాజేశ్వరరెడ్డిని తెరపైకి తెచ్చింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పల్లా బలమైన వ్యక్తిగా భావించి గులాబీ బాస్ కేసీఆర్ ఆయనను బరిలో ఉంచారు. పల్లాకు పెద్దసంఖ్యలో విద్యాసంస్థలు ఉం డటంతో వారి సిబ్బంది ఓటర్ల నమోదు నుంచి పోలింగ్ ముగిసేవరకు పెద్దసంఖ్యలో భాగస్వాములయ్యారు. ఇంజనీరింగ్ కళాశాలల యాజమానుల రాష్ట్ర సంఘంలో పల్లా కీలక బాధ్యతల్లో ఉండటంతో ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నమోదు చేయించారు. అదేరీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకించే శక్తులు, మేధావులు, ప్రొఫెసర్ కోదండరాంకు మద్దతుగా నిలిచాయి. ఆయన స్థాపించిన తెలంగాణ జన సమితి(టీజేఎస్) నాయకులు, కార్యకర్తలు ఓటర్లను నమోదు చేయించారు. సోషల్ మీడియా ఆయుధంగా ఎదిగిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న భారీగా అనుచరగణాన్ని ఏర్పరుచుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిధిలోని 12 జిల్లాలో ఆయన టీంతో కలిసి మల్లన్న పాదయాత్ర చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వామపక్షాలు బలంగా ఉన్నాయి. వారికి అనుబంధంగా విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు బలంగా ఉన్నాయి. వారంతా తమ ఉమ్మడి అభ్యర్థిగా వామపక్షవాది, జర్నలిస్ట్ జయసారధిని అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మొత్తంగా ఈ నలుగు రు హోరాహోరీగా పోరాడటంతో మూడేళ్ల కిందట పట్టభద్రుల ఎన్నిక రసవత్తరంగా జరిగింది.నేటికీ నమోదు చేసుకుంది 53 వేలే పట్టభద్రుల స్థానానికి 2021లో ఫిబ్రవరి 23న పోలింగ్ జరగ్గా 5,05,565 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో పురుషులు 3,32,634 కాగా, మహిళలు 1,72,864 మంది, ఽథర్డ్‌జెండర్ ఓటర్లు 67 మంది ఉన్నారు. 12 జిల్లాల్లో మొత్తం 731 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదుకు అర్హులైన పట్టభద్రులు గతంలో ఓటర్‌గా నమోదైన వారు కూడా ఫారం-18 ద్వారా విధిగా ఫిబ్రవరి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 నవంబరు 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటరు జాబి తా, ఏప్రిల్ 4న తుదిజాబితా ప్రచురించనున్నారు. మూడేళ్ల కిందట ఐదు లక్షలకు పైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోగా ప్రస్తుతం 53,316 మంది మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం అఽధికారులను, రాజకీయపక్షాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 12 జిల్లాల్లో 53,316మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లాల నుంచి 20వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల సంఖ్యను పెంచేందుకు పట్టభద్రుల ఎన్నికల అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన చర్యలు ప్రారంభించారు. ఈ నెల 22న 12 జిల్లాల ఆర్డీవోలతో నల్లగొండలో ప్రత్యేకంగా సమా వేశం నిర్వహించి ఓటర్ల నమోదు సంఖ్యను పెంచేం దుకు దిశానిర్ధేశం చేయనున్నారు.వరుస ఎన్నికలతో నిరాశ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారింది. పదేళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తరువాత కాం గ్రెస్ అధికారం చేపట్టింది. ప్రభుత్వంపై వ్యతిరేకత అనే ఆలోచనే ప్రస్తుతం మొలకెత్తలేదు. ఈ పాటికే పట్టభద్రుల నోటిఫికేషన్ వచ్చేసింది. రాజకీయ పార్టీల దృష్టి అంతా ఎంపీ ఎన్నికలపైనే ఉంది.మరో రెండు నెలల్లో ఎంపీ ఎన్నికలు పూర్తి కానున్నాయన్న ధ్యాసతో రాజకీయ పక్షాలు పా వులు కదుపుతున్నాయి. ఇక అభ్యర్థుల విషయానికొస్తే గ తంలో గెలిచిన పల్లా జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీజేఎస్ చైర్మన్ కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డినే ఇటీవల ప్రకటించారు. గవర్నర్ కోటాలో ఆయనకు అవకాశం దక్కనుంది. ఇక తీన్మార్ మల్ల న్న కాంగ్రెస్ పక్షాన భువనగిరి ఎంపీ స్థానంపై బలంగా గురిపెట్టారు. ప్రస్తుతం జరిగే పట్టభద్రుల ఉపఎన్నిక తాజా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయానికి మచ్చుతునక అనే పరిస్థితి లేకపోవడం వంటి వరుస పరిణామా ల నేపథ్యంలో రాజకీయపక్షాలు, నా యకులు పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పట్టభద్రుల ఎన్నిక అంటేనే నిరాసక్తత నెలకొంది.ఓటు నమోదుకు విస్తృత ప్రచారం చేస్తున్నాం: హరిచందన, పట్టభద్రుల ఎన్నికల అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు వివిధ మాధ్యమా ల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. రాజకీయ పార్టీలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నాం.ఇటీవలే పండుగ సెలవు లు ముగిసిన నేపథ్యంలో డీఈవోలు,ఆర్‌ఐఓలతో సమావేశం నిర్వ హించి ఉపాధ్యాయుల ఓట్లు నమోదుచేసేలా ఆదేశాలు జారీ చే శాం.ప్రభుత్వకార్యాలయాల్లో సైతం ఓటర్లు నమోదు చేసుకునేందు కు చైతన్యం చేయాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు ఆదేశా లు జారీ చేశాం.రాబోయే రోజుల్లో నమోదును పెంచేందుకు ఎ న్నికల కమిషన్ అధికారి సూచన మేరకు ముందుకు వెళ్తాం.