2 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ Hyderabad news భారత్ ప్రతినిధి : తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. జనవరి 11న నోటిఫికేషన్ వెలువడనుంది. జనవరి 18న నామినేషన్లకు చివరితేదీగా ప్రకటించింది. జనవరి 29న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.అదేరోజున ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపింది. 2023లో ఇద్దరు తమ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో తెలంగాణలో రెండు, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి ఖాళీగా ఉన్నాయి. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి పదవీకాలం 2027 నవంబరు 30 వరకు ఉంది. కానీ ఎమ్మెల్యేగా గెలుపొందాక రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక తప్పనిసరిగా మారింది.