Type Here to Get Search Results !

Sports Ad

సంక్రాతి పండుగకి ఉరికెళ్తున్నారా... జాగ్రత్త.. పోలీస్ వారి సూచనలు పాటించండి. Are you hanging yourself for Sankranti festival... be careful... follow the instructions of the police.


 సంక్రాతి పండుగకి ఉరికెళ్తున్నారా... జాగ్రత్త.. పోలీస్ వారి సూచనలు పాటించండి.

గద్వాల్ Gadwal News భారత్ ప్రతినిధి : సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాలు మీ అప్డేట్స్ పెట్టకండి.స్వీయ రక్షణ కు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకోవటం మంచిది.ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకి, డయాల్ 100 కి సమాచారం అందించాలి. జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS. సంక్రాతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు,బంధువుల ఇండ్లకి, విహార యాత్రలకు వెళ్లే ఆయా గ్రామాల, కాలనీ, ఆపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS  గారు ఓ ప్రకటనలో తెలిపారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోనీ ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరు అని తెలిపారు.ప్రజలకు జిల్లా  పోలీస్  వారి సూచనలు ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు తమతో పాటే తీసుకెళ్లాలి.సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం,సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది.తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. 

      వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం.మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో  లాక్ వెయ్యడం మంచిది.నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్ సెక్యూరిటీ గార్డ్ సర్వెంట్ గా నియమించుకోవాలి.మీఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను లైవ్ ప్రత్యేక్షంగా చూసుకొవచ్చు.సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి.ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టన్ వేయాలి.ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి.ఇంట్లో లేనప్పుడు పని మనుషులు ఉంటే రోజు వాకిలి ఊడ్చమని చెప్పాలి.  ఇంటి ముందు చెత్త చెదారం,న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్థులు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నది.మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి.డయల్ 100కు కాల్ చేయండి.ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు..జిల్లా పోలీస్ కార్యాలయం జోగుళాంబ గద్వాల్ జిల్లా.

మరిన్ని వార్తల కోసం...
* వికారాబాద్ లోభారీగా గంజాయి స్వాధీనం ఇక్కడ క్లిక్ చేయండి
* 'సూపర్ బగ్' బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది... ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజావాణికు పోటెత్తిన దరఖాస్తులు ఇప్పటికైనా సమస్యలు తీర్చండని నిరసనలు ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ ఒకేసారి! ఇక్కడ క్లిక్ చేయండి
* సంక్రాతి పండుగకి ఉరికెళ్తున్నారా... జాగ్రత్త.. పోలీస్ వారి సూచనలు పాటించండి. ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies