నేలఉసిరి మొక్క యొక్క లాభాలు
* షుగర్ వ్యాధికి నియంత్రణకు
* కామెర్లు తగ్గించేందుకు నేల ఉసిరిక
* నేలఉసిరి మొక్క యొక్క లాభాలు
ఆరోగ్యం Health : నేల ఉసిరి ఫిలాంథేసి కుటుంబానికి చెందినది. ఇది ఒక ఔషధాల గని. దీని ఆకులు చింత ఆకుల లాగ ఉండి చిన్న చిన్న కాయలు రెమ్మ క్రింది భాగములో వస్తాయి.దీని వేర్లు కాండము ఆకులు, కాయలు దాకా అన్నీ ఉపయోగాలే.. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలో అనేక రుగ్మతలను, జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.నోటి పూత, దంతాల వాపు, దంతాల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను నివారించడంలో నేల ఉసిరి ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.దగ్గు, తుమ్ములు, జలుబు వంటి సమస్యలతో బాధ పడే వారు, అధిక బరువుతో ఇబ్బంది పడే వారు.ఫ్రెష్‌గా ఉండే నేల ఉసిరి ఆకులను బాగా నమిలి మింగాలి.నేల ఉసిరిని జ్యుస్ గా తీసుకుంటే మూత్ర ఇన్ఫెక్షన్లు మరియు పొత్తి కడుపులో మంట తగ్గిపోతుందిశరీరంలో దురద, గాయాలు, గజ్జి, రింగ్వార్మ్స్ చికిత్సలో కూడా నేల ఉసిరిని ఉపయోగిస్తున్నారు.శరీరంలో ఎసిడిటీ, ఆమ్లత్వం నుండి ఉపశమనం పొందడానికి మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరును చురుకుగా చేస్తుంది.నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర కిడ్నీ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.మధుమేహానికి (డయాబెటిస్) ఈ జ్యూస్ చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.
షుగర్ వ్యాధికి నియంత్రణకు
1) తిప్పతీగ
2) ఉత్తరేణి
3) వేప
4) నేలఉసిరి
5) పిప్పింట
ఈ ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి ఈ రోజు ఉదయం రాత్రి రెండు పూటలా ఒక స్పూన్ చొప్పున తేనెలో కలుపుకొని తినాలి .ఒక్కో వనమూలిక ఒక్కో విధంగా పని చేస్తుంది.విషపూరితమైనవి ఏమి కాదు కదా అందరికీ తెలిసినవే ఉపయోగకరమైనవే వాడండి ఫలితం తెలుస్తుంది .ఇందులో చాలా ముఖ్యమైనది తిప్పతీగ కామెర్ల తగ్గించేందుకు నేల ఉసిరిక నేల ఉసిరిక ఖాళీ ప్రదేశాలలో ఎక్కడయినా దొరుకుతుంది. కామెర్ల ఒక్కటే కాకుండా ఇతర లివర్ వ్యాధులు, అలాగే స్త్రీల గర్భాశయ వ్యాధులమీద కూడా బాగా పనిచేస్తుంది.వేళ్ళతో సహా ఈ మొక్కలను తీసుకుని ఎండబెట్టి, దంచి ఆపొడిని ఓ సీసాలో భద్రపచుకోండి. కామెర్లు కలిగినపుడు ఈ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది.తెల్లబట్ట_అవుతున్న_వారికి దీనిని తీసుకుని బియ్యాన్ని కడిగిన నీటిని త్రాగితే తగ్గుతుంది.
నేలఉసిరి మొక్క యొక్క లాభాలు
నేలఉసిరి, మిరియాలను కలిపి నూరి మజ్జిగలో కలుపుకుని ఏడు రోజులు తీసుకుంటే కామెర్లు వ్యాధి తగ్గుతుంది నేలఉసిరి వేరునూరి ఆవు పాలతో కలిపి రెండు పూటలా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.నేలఉసిరి ఆకులు మెత్తగా దంచి గజ్జి మరియు తామర ఉన్నచోట రాస్తే గజ్జి మరియు తామర తగ్గిపోవడం జరుగుతుంది.ఆరోగ్య సూచన తులసి లాగానే విస్తృత ఆరోగ్య ప్రయోజనాలు గల దివ్య ఔషది. ఇంటి నందు గల కుండీలో పెంచి రోజుకు ఒక రెమ్మకు గల ఆకులను తినండి.