ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్.తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చి సమస్యల కుప్పగా మారిన ధరణి పోర్టల్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్, భూ నిపుణులు, అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లను నియమించింది.సీసీఎల్ఏ ఈ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించున్నారని ప్రభుత్వ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను రెడీ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ధరణి పోర్టల్‌లో చేయాల్సిన మార్పులను సిఫార్స్ చేయనుంది.