ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో కీలక నిర్ణయం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలోనే కొన్ని జిల్లాల కలెక్టర్‌లతో సమావేశం కావాలని నిర్ణయించామని త్వరలోనే ప్రభుత్వాని కి నివేదిక అందచేస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు.సోమవారం సాయంత్రం సిసిఎల్ కార్యాలయంలో ధరణి కమిటీ సభ్యులు మూడోసారి ధరణి సమస్యలపై సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధరణి కమటీ సభ్యులు మాట్లాడారు.ఈ సందర్భగా ముందుగా రేమండ్ పీటర్ మాట్లాడుతూ ‘ధరణి’ లొసుగులపై చర్చిస్తున్నా మని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటు న్నట్లు ఆయన పేర్కొన్నారు.మీ సేవలో ఉన్న సమస్యలు, అగ్రికల్చర్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా సమావేశం అవుతా మన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సమయం పడుతుందన్నారు.నివేదిక వచ్చాక ప్రభుత్వం ‘ధరణి’పై స్పందిస్తుందని రేమండ్ పీటర్ తెలిపారు. ధరణి పోర్టల్‌తో పాటు మెరుగైన భూ పరిపాలన అందించేందుకు అవసర మైన మార్పులను కూడా తాము అందిస్తామన్నారు.
అలాగే ఆర్‌ఓఆర్ 2020కి సవరణలు అనివార్యమని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లోని భూముల డేటాను క్రోఢీకరించనున్నట్టు ఆయన తెలిపారు.ఈ మూడింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పడనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒకేసారి నివేదికను అందించకుండా తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వేర్వేరుగా మార్గాలను అందించనున్నట్టు ఆయన తెలిపారు.ధరణి లేదా ఇతర ఏ సాఫ్ట్‌వేర్ అమలు చేసినా ఏదైనా అప్లికేషన్ చేస్తే ఆమోదించినా, తిరస్కరించినా సమాచారం రావాలి. ఎందుకు తిరస్కరించారో కూడా దరఖాస్తుదారుడికి సమాచారం అందాలి. ప్రతిదీ సర్వర్‌లో నిక్షిప్తం కావాలి. ధరణి పోర్టల్లో అలాంటి వ్యవస్థ ఉందా? లేదా? అన్నది పరిశీలిస్తున్నామన్నారు.