Type Here to Get Search Results !

Sports Ad

కొడంగల్ లో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ First Government Engineering College in Kodangal


 కొడంగల్ లో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో రాష్ట్రంలోనే తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు కానుంది.ఇప్పటికే ఉన్న కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని ఇంజినీరింగ్‌ కళాశాలగా మారింది.ఈ మేరకు కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని అప్‌గ్రెడేషన్‌ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు వెలువరించారు.2024-2025 విద్యా సంవత్సరం నుంచే కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.ఈ కొత్తగా ఏర్పాటు చేయనున్న గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదట 3 బీటెక్‌ బ్రాంచీలు అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.బీటెక్‌ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ ఏఐ అండ్‌ ఎంఎల్‌. సీఎస్‌ఈ డేటా సైన్స్‌ 3 కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు ఈ కాలేజీలో ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తల కోసం... 
* కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు ఇక్కడ క్లిక్ చేయండి 
* నా జీవితం ధన్యమైంది యూపీ సీఎం యోగి ఇక్కడ క్లిక్ చేయండి
* మెట్రో ఫే జ్‌-2 మార్గాన్ని ఖరారు చేసిన తెలంగాణ ఇక్కడ క్లిక్ చేయండి
* డయాబెటిస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మధ్య సంబంధం దీన్ని ఎలా నివారించాలి ఇక్కడ క్లిక్ చేయండి
* కొడంగల్ లో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుంచి సామాన్యులకు బాల రాముడి దర్శనం ఇక్కడ క్లిక్ చేయండి
* ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో కీలక నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies