Type Here to Get Search Results !

Sports Ad

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.Follow these tips to keep your eyes healthy.


 కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.

ఆరోగ్యం Health : ప్రపంచమంతా టెక్నాలజీ మయం అయిపోయింది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ వివిధ కారణాలతో నిరంతరాయంగా కంప్యూటర్ / మొబైల్ కు కళ్లప్పగించేస్తే కళ్ల అందం, ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. చాలామందిలో ఇది కంటి అలసటకు, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి కారణమవుతుంది. మరి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం రండి.20-20-20 సూత్రాన్ని తప్పనిసరిగా పాటించండి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వండి.విశ్రాంతి తీసుకొనే సమయంలో కళ్లను నవ్య, అపసవ్య దిశాల్లో గుండ్రంగా తిప్పాలి. లేదంటే కళ్లను మూసి ఉంచాలి, చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు.ఇలా చేస్తే కళ్లు పొడిబారి మంట పెడతాయి. అందుకే తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలి.ఒకవేళ కళ్లు తరచూ పొడిబారుతూ ఉంటే వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించి ఐ డ్రాప్స్ తీసుకోవడం మంచిది. కళ్లు, మానిటర్ ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కళ్లు ఎటువంటి ఒత్తడికి గురి అవ్వవు.

కళ్లకు, కంప్యూటర్ స్క్రీన్కు మధ్య కనీసం 22 నుంచి 28 అంగుళాల దూరం ఉండాలి.దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్ను తరచూ శుభ్రం చేసుకోవాలి.మానిటర్పై వెలుగు వడకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో కిటికీలు, తలువుల నుంచి స్క్రీన్పై నేరుగా వెలుతురు పడకుండా కర్టెన్లు ఉపయో గించాలి.అలాగే స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మనకంటికి సరిపోయే రీతిలో అమర్చుకోవాలి.

కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి వీలుగా -లభించే యాంటీ రిఫెక్టివ్ కళ్లద్దాలను ఉపయోగించ వచ్చు. ఈ విషయంలో వైద్యుని సలహా తప్పనిసరి.గదిలో ప్రసరిస్తున్న వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ పెట్టింగులను మార్చే సాఫ్ట్వేర్లను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. వీటివల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి. ఫలితంగా కళ్లపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.కంప్యూటర్పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 1. కంటి ఆరోగ్యం విషయంలో ఆహారం కూడా కీలకమే. ఈ క్రమంలో బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారట్స్, చిలగడదుంప, ఆకుకూరలు, లైకోపీన్ ఎక్కువగా లభించే టొమాటో, జామ పండ్లు, ద్రాక్ష పండ్లు.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసు కోవాలి. అలాగే డాక్టర్. సలహా మేరకు విటమిన్-ఎ సప్లిమెంట్స్ వాడాలి.ఒక చిన్న గిన్నెలో చల్లది పాలు తీసుకొని అందులో రెండు కాటన్ ప్యాడ్స్ ముంచాలి. ఆపై పాలను పూర్తిగా పిండేసి.. ఆ చల్లచల్లటి ప్యాడ్స్ ని కనురెప్పలపై ఉంచాలి. ఇలా పలుమార్లు చేయడం వల్ల కంటి అలసటను తగ్గించుకోవచ్చు. అలాగే కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలూ మాయమవుతాయి. కళ్లు తేమను సంతరించుకుంటాయి.

మరిన్ని వార్తల కోసం... 
* ఎక్మాయి గ్రామంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయం నందు ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* 2024 ఎన్నికల ట్యాగ్‌లైన్‌ లోగోను విడుదల చేసిన ఈసి ఇక్కడ క్లిక్ చేయండి
* గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. ఇక్కడ క్లిక్ చేయండి
* మద్దిఅర్జున యెక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేలఉసిరి మొక్క యొక్క లాభాలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies