తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు శుభవార్త
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో రేషన్‌కార్డు దారులకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ గడువును మరో నెల రోజులు పొడిగించింది.ఈ నెలాఖరు నాటికి ఈ-కేవైసీ గడువు ముగియబోతుండటం.. ఇంకా చాలా మంది కేవైసీ చేయించుకోకపోవటం తో,ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం తెలిసిందే. రేషన్ కార్డుదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళ్లటం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డుల్లో ఉండటం.ఇతరత్రా కారణాల వల్ల చౌక ధరల దుకాణాల నుంచి అందుతున్న నిత్యావసర సరుకులు దారి మళ్లుతు న్నాయని, బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని గుర్తించారు.దీంతో లబ్దిదారులు తమ రేషన్ కార్డులను అప్‌డేట్ చేసుకోవడానికి పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ-కేవైసీ విధానాన్ని తెరమీదికి తీసుకొచ్చింది.ఈ నెల 31వ తేదీ నాటికి ఈ- కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ముందుగా చెప్పారు. గడువు సమీపించిన నేపథ్యంలో లబ్దిదారులు ఆన్‌లైన్ ద్వారా ఈ-కేవైసీ అప్‌డేట్ కోసం ఎగబడుతున్నారు.ఆన్‌లైన్ కేంద్రాలతో చౌక ధరల డిపోల వద్ద బారులు తీరుతున్నారు. ఫలితంగా సర్వర్లు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల అప్‌డేట్ కావట్లేదనే ఫిర్యాదులూ అధికారులకు అందుతున్నాయి.