లవంగాలు తింటే...?
ఆరోగ్యం Health : ఉదయాన్నే లవంగం తినడం వల్ల నోట్లో లాలాజలం పెరిగి జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే లవంగాలు తలతిరుగుడు, కడుపులో మంటలను కూడా తగ్గిస్తాయి. లవంగాలు తినడం వల్ల వయసు పైబడే వేగం కూడా తగ్గుతుంది. లవంగాన్ని నమలినప్పుడు వెలువడే సుగంధం, దాన్లోని యాంటీమైక్రోబియల్ గుణాలు నోటి ఆరోగ్యానికి దోహదపడతాయి. లవంగం నమలడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు.నోటి దుర్వాసన తొలగిపో తుంది. నోరు తాజాగా ఉంటుంది.
దీన్లోని యాంటీ ఇన్ఫ్లమే టరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.జీర్ణశక్తిని పెంచడంతో పాటు, వ్యాధినిరోధకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.లవంగాలతో మలబద్ధకం తొలగడంతో పాటు, వీటిలోని అనాల్జెసిక్ గుణాల వల్ల ఇది సహజసిద్ద నొప్పి నివారిణిగా కూడా పని చేస్తుంది.లవంగాల్లోని హెపటో ప్రొటెక్టివ్ ప్రభావాలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. కాలేయంలో కొత్త కణాల ఉత్పత్తిని పెంచడంతో పాటు, థైమాల్, యూజినాల్ మొదలైన చురుకైన కాంపౌండ్స్లో కాలేయంలోని విషాలను తొలగిస్తాయి.