Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు in Hyderabad


హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది.రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగనున్న దృష్ట్యా నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు ఈ కరెంటు కోతలు విధిస్తున్నట్లు పేర్కొంది.వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్న దృష్ట్యా డిమాండ్ ను తట్టుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పవర్ లైన్లు, సబ్ స్టేషన్లలో రొటేషన్ పద్ధతిలో నిర్వహణ, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు టిఎస్ఎస్ పిడిసిఎల్ తెలిపింది.ఏయే ప్రాంతాల్లో ఏ రోజు కరెంటు కోత అమలవు తుందో తెలుసుకునేందుకు టిఎస్ఎస్ పిడిసిఎల్ వెబ్ సైట్ ను చూడవచ్చు.కరెంటు కోతలవల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ పేర్కొన్నారు.నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, అవసరమైతే కొత్త విద్యుత్ లైన్లు వేస్తామని ఆయన వివరించారు.ఒక్కొ ఫీడర్ కు ఒక్కొ రోజు మాత్రమే కరెంటు కోతలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం...

* హైదరాబాదులో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు ఇక్కడ క్లిక్ చేయండి
* అయోధ్య: 108 అడుగుల అగరబత్తి.. 50 కిలోమీటర్ల మేర సువాసన వ్యాప్తి ఇక్కడ క్లిక్ చేయండి
* రామ నామ స్మరణతో మారుమోగుతోన్న దేశం పాఠశాలలో ప్రజెంట్ సార్‌కు బదులు 'జై శ్రీరామ్' ఇక్కడ క్లిక్ చేయండి
* ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌కు త్వరలోనే గైడ్‌‌లైన్స్! ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies