బాలికపై అఘాయిత్యం చేసిన ఆలయ పూజారిని అరెస్టు చేయాలి
* బాలికపై అఘాయిత్యం చేసిన ఆలయ పూజారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
* పోలీస్ స్టేషన్కు వచ్చిన కూడా పోలీసులు ఎందుకు FIR నమోదు చేయలేదు?
* పేద బాలికలకు ఒక న్యాయం.. ధనవంతులకు ఒక న్యాయమా?
* వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరపాలి
* వికారాబాద్ జిల్లా కార్యదర్శి వై.గీత
* PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ డిమాండ్
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన పట్ల పోలీసు వారు వెంటనే స్పందించి పూజారిపైన కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి అని ప్రగతిశీల మహిళా సంఘం వికారాబాద్ జిల్లా కార్యదర్శి వై.గీత తేలిపారు.గుడిసెల్లో నివాసం ఉంటున్నటువంటి బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలి ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఆ కుటుంబానికి న్యాయ సహాయం అందించడంలో అండగా ఉండాలి.సంపన్న వర్గ కుటుంబాలలో సమస్యలు వచ్చినప్పుడు పరిగెత్తుకు వచ్చి భరోసా ఇచ్చే న్యాయ వ్యవస్థలు పేదల పక్షాన ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ దేశంలో సంపన్నులకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయమా బాలిక కుటుంబానికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సందర్శించి న్యాయం చేయడంలో ముందు ఉండాలి.ఈటియాగాయిత్యానికి పాల్పడ్డాడు వంటి పూజారి పైన చట్టపరంగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి ఇలాంటి అఘాయిత్యాన్ని చట్టం దృష్టికి పోనీయకుండా అడ్డుకొని కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నించిన ప్రముఖ పెద్ద మనుషుల పైన కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి అని లేని పక్షంలో పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాలికగా ఉండగా న్యాయ పోరాటానికి పూనుకుంటామని తెలియజేయడం జరిగింది.
PDSU విద్యార్థి సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ
ఐదేళ్ల బాలికపై పూజారి ఆఘాయిత్యం చేసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకొని నిర్భయ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి మొరపెట్టుకున్న కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు ? అంటే ధనవంతుడికి న్యాయం ఒక విధంగా, పేద బాలిక కాబట్టి న్యాయం ఇంకో విధంగా ఉంటుందా?
భారత రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరు సమానమే కదా? జీవన ఉపాధి కోసం గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్న పేదవారు అనే చిన్న చూపా ? వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రముఖులు ఎవరైతే బయటకు రాకుండా తప్పు చేసిన వ్యక్తికి వత్తాసు పలికారో వారి పైన కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది.