ప్రజావాణికు పోటెత్తిన దరఖాస్తులు ఇప్పటికైనా సమస్యలు తీర్చండని నిరసనలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. అధికారులకు తమ గోడును విన్నవించుకోవడానికి అర్జీదారులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన అధికారులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.ప్రజావాణికు పోటెత్తిన దరఖాస్తులు- ఇప్పటికైనా సమస్యలు తీర్చండని నిరసనలు.ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యల ఫిర్యాదులు పోటెత్తాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హాజరైన ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన అధికారులు పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అర్జీదారులను ప్రత్యేక క్యూలైన్లలో ప్రజాభవన్‌లోకి అనుమతించారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ చైర్లలో సిబ్బంది వారిని లోనికి తీసుకువెళ్లారు.ప్రజావాణికి విశేష స్పందన - కలెక్టర్ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు.రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి హాజరైన ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. పింఛన్లు, భూ సమస్యల ఎక్కువ అర్జీలు అందినట్లుగా అధికారులు తెలిపారు. తన సమస్యను పరిష్కారించాలని కోరుతూ ప్లకార్డుతో నిల్చున్న అర్జీదారుని చూసి ప్రజాభవన్ నుంచి బయటకు వెళ్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కారును ఆపారు. సమస్యపై ఆరాతీసి అతని నుంచి అర్జీని స్వీకరించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.