Type Here to Get Search Results !

Sports Ad

అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సిఎస్ శాంతి కుమారి in telangana


 అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సిఎస్ శాంతి కుమారి

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డాటా ఎంట్రీలపై కలెక్టర్లతో ఈరోజు టెలీకాన్ఫ రెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామసభ లను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహి స్తుండడంపై కలెక్టర్లను సీఎస్‌ అభినందించారు.6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు.మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్‌మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్‌వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిం చాలని తెలిపారు.ఈ డాటా ఎంట్రీ చేపట్టేం దుకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రస్థాయిలో ట్రెయినీ ఆఫ్ ట్రైనర్ (TOT )లకు 4న శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ టీఓటీలకు జిల్లా స్థాయి లో డాటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.5 నుంచి 17 వరకు 

      అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయా లని, ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమిం చుకోవాలని ఆదేశించారు. నిన్నటి వరకు దాదాపు 57లక్షల దరఖాస్తులు అందాయని, ప్రతీ నాలుగునెలలకోసారి ప్రజాపాలన నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు.దరఖాస్తులు ఇవ్వని వారు తిరిగి దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయితీ రాజ్ కమిషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి
* అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి : సిఎస్ శాంతి కుమారి ఇక్కడ క్లిక్ చేయండి 
* సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* 12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏప్రిల్‌లో టెట్‌! ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies