ధరణి లొసుగులపై దర్యాప్తు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ధరణి పోర్టల్లోని లొసుగులను అడ్డంపెట్టుకొని ప్రభుత్వ భూములకు పట్టాలు జారీ చేసిన వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని చాలా మండలాల్లో కొంతకాలం కిందట నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య హక్కులు కల్పించడాన్ని రెవెన్యూ వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. గత నెలలో సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణి పోర్టల్ భూ సమస్యలపై నిర్వహించిన సమీక్షలో వీటిపై ఆరా తీశారు. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో రాత్రిపూట జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారం అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం నివేదిక సిద్ధం చేస్తోంది.