శ్రీ బలరాం నాయక్ గారికి సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం Bhadradri Kothagudem News భారత్ ప్రతినిధి : నూతనంగా సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన శ్రీ బలరాం నాయక్ గారిని సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు సంఘ సభ్యులు శ్రీ బలరాం నాయక్ అంకిత భావం సమర్థత కలిగిన సామాజిక సంబంధాలు కూడా నెలకొల్పే సేవా తత్పరుడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ శ్రీ బలరాం నాయక్ మహబూబ్నగర్ జిల్లాలోని చిన్నకు గ్రామంలో జన్మించి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అంకితభావం కృషి దీక్ష దక్షితలతో కష్టపడి చదివి అత్యున్నతమైన IRS సాధించి సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు ఉన్నతమైన డైరెక్టర్ పా గా నియమితులై అటు సింగరేణి సంస్థ అభివృద్ధికి ఇటు కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న వారి విశిష్ట సేవలను గుర్తించి నేడు ప్రజా ప్రభుత్వంగా కొనియాడ బడు తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల వారసుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో అత్యంత ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థకు అత్యంత ఉన్నతమైన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించడం యావత్ దళిత జాతికి మరియు
తెలంగాణకే గర్వకారణమని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.శ్రీ బలరాం నాయక్ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా
నియమితులైన తర్వాత ఫ్రప్రధమంగా కొత్తగూడెం విచ్చేసిన సందర్భంగా 08 01 2024 రాత్రి 8 గంటలకు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన ముఖ్య సంఘ నాయకులందరితో కలిసి హెడ్ ఆఫీస్ లోని వారి ఛాంబర్ లో పూల బొకేలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ శ్రీ బలరాం నాయక్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలుపునిచ్చిన నినాదానికి నిలువెత్తు నిదర్శనమని వారి హయాంలో నూతన బొగ్గు బావులు నూతన ప్రాజెక్టులు నెలకొల్ప బడి నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని అంతేగాక దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సింగరేణి సంస్థలోని కార్మిక సమస్యలన్నీ సత్వరమే పరిష్కరింపబడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ తో పాటు సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు విశ్రాంత సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీ అందెల ఆనందరావు రాష్ట్ర చర్మకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కూసపాటి శ్రీనివాస్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా హనుమంతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.